Home » దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా ?

దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినప్పటికీ ఆశించిన మేరకు లాభాలు తీసుకురావడంలో అన్ని సినిమాలకి సాధ్యం కాదు. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన భారీ కలెక్షన్లు సాధించాయి. అందులో బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఆ కోవకు చెందుతాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన అఖండ, కార్తికేయ 2, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. దేవుళ్ళ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ మూడు సినిమాలు చాలా ప్రత్యేకమైన చెప్పవచ్చు. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు బడ్జెట్ దాదాపు రూ.60 కోట్లు ఖర్చు ఖర్చు అయింది. అఖండ రూ. 53 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా ఓవరాలుగా దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసింది. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమా కంటే అఖండ మంచి లాభాలను తీసుకొచ్చింది అని పేర్కొనడం విశేషం.  ముఖ్యంగా అఖండ పాత్ర అద్భుతం అనే చెప్పాలి. దేవుడి నేపథ్యంలో అఖండ గా నటించిన బాలయ్య ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి మంచి లాభాలను తీసుకొచ్చారు.

Kartikeya 2

Advertisement

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. విచిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఖేర్ శ్రీకృష్ణుని తత్వం గురించి చెప్పే డైలాగులు గూస్ బంప్ తెప్పించాయి. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ 2 రూ. 121.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే టార్గెట్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. తక్కువ బడ్జెట్ చిత్రాలలో సూపర్ హిట్ చిత్రం కార్తికేయ 2 ఒకటి.

Also Read : రిషబ్ శెట్టి: కాంతార లో “ఓ” అనే అరుపు చాలా సెంటిమెంట్.. ఎవరు అనుకరించవద్దు..!!

అఖండ, కార్తికేయ సినిమా మాదిరిగానే కాంతారా సినిమా కూడా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కింది. సినిమా తొలుత కర్ణాటకలో విడుదల అయింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడంతో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదల చేశారు. విడుదలైనప్పటినుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఈ సినిమాకు మంచి ప్లస్ అయింది. రూ.16 కోట్ల బడ్జెట్ తో కాంతారా చిత్రం తెరకెక్కింది. కేవలం కర్ణాటకలోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో రూపాయలు రెండు కోట్లకు అల్లు అరవింద్ కాంతారా సినిమాను దక్కించుకున్నారు. దాదాపు ఇప్పటివరకు 15 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా కాంతారావు సినిమా కోట్లకు పైగా వసూలు చేసింది. చిన్న సినిమాగా తెరకెక్కి భారీ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా కాంతారా రికార్డ్ సృష్టించింది. థియేటర్ రన్నింగ్ పూర్తయ్యేలోపు ముందు ముందు ఇంకా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ  తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ, కార్తికేయ 2, కాంతారా సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయనే చెప్పవచ్చు.

Also Read :  “ఫిదా” సినిమాలో వ‌రుణ్ తేజ్ త‌మ్ముడు ఎవ‌రో తెలుసా…? సినిమా ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..?

 

Visitors Are Also Reading