Home » కమల్ హాసన్ శ్రీవిద్య లవ్ స్టోరీలో ఉన్న ట్విస్ట్ ల గురించి మీకు తెలుసా ?

కమల్ హాసన్ శ్రీవిద్య లవ్ స్టోరీలో ఉన్న ట్విస్ట్ ల గురించి మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ శ్రీవిద్య అంటే తెలియని వారు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె తెలుగు,మలయాళం, హిందీ, కన్నడ, తమిళం ఇలా ఎన్నో భాషల్లో దాదాపు 500 పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి శ్రీవిద్య తన కెరియర్ మంచి పొజీషన్ లో కొనసాగుతున్న తరుణంలోనే హీరో కమలహాసన్ తో లవ్ లో పడింది. కానీ ఈమె ప్రేమలో పడే సమయానికి ఆయన శ్రీవాణితో లవ్ లో ఉన్నారు.

Advertisement

ఈ విషయం తెలిసి కూడా శ్రీవిద్య కమలహాసన్ తో లవ్ కంటిన్యూ చేసింది. అలా కమలహాసన్ శ్రీవిద్య కాంబినేషన్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ చివరికి కమలహాసన్ శ్రీ వాణిని పెళ్లి చేసుకోవడంతో వీరి ప్రేమ మూడునాళ్ల ముచ్చటగానే మారింది. అలాంటి వీరి ప్రేమ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో శ్రీవిద్య సోదరుడి భార్య విజయలక్ష్మి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. శ్రీవిద్య నేను ఎంతో క్లోజ్ గా ఉండే వాళ్ళమని, ఆమె కమలహాసన్ ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు అని చెప్పింది. నా భర్త శంకర్ కమలహాసన్ మంచి స్నేహితులు. ఓసారి కమలహాసన్ కూడా శంకర్ తో మాట్లాడుతూ నేను కూడా శ్రీవిద్యను ప్రేమిస్తున్నానని,ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు.

Advertisement

దీంతో శంకర్ మా ఇంట్లో వారితో మాట్లాడక చెప్తాను అని సమాధానం ఇచ్చారట. అయితే ఇదే విషయాన్ని శంకర్ తన ఇంట్లో చెప్పగా మా అత్తయ్య( శ్రీవిద్య తల్లి )ఒప్పుకోలేదట. శ్రీవిద్యకు ఇండస్ట్రీలో అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పిందట. దీంతో కమల్ శ్రీవిద్య పూర్తిగా విడిపోవలసి వచ్చిందట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading