Home » చరిత్ర మరచిన యోధుడు.. 18 ఏళ్లకే ఉ* కంబమెక్కిన విప్లవ వీరుడి గురించి మీకు తెలుసా ?

చరిత్ర మరచిన యోధుడు.. 18 ఏళ్లకే ఉ* కంబమెక్కిన విప్లవ వీరుడి గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

అతడి వయసు అప్పుడు కేవలం 18 సంవత్సరాల 8 నెలల 8 రోజులు మాత్రమే. టీనేజ్ వయస్సు కానీ.. అంత చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు అతడు. ఆయనే కుదిరామ్ బోస్. అతి పిన్న వయసులోనే వీరమరణం పొందిన స్వాతంత్య్ర  సమరయోధుడు కుదిరామ్ బోస్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నూటికో కోటికో ఒకరికి తెలిసి ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం ఆయన పోరాటం గురించి తెలుసుకుందాం.


అవి భారతీయులు బ్రిటిష్ పాలనతో విసిగి వేసారి పోయిన రోజులు. 3 డిసెంబర్ 1889న ఇప్పటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కుదిరామ్ బోస్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన కుదిరామ్.. దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించేవాడు. చిన్నవాడైనప్పటికీ స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. అందుకోసమే విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు కుదిరామ్. అతడికి 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు.. అరబిందో మాటలతో స్ఫూర్తి పొందాడు. ఆ వయసులోనే స్వాతంత్య్రం కోసం పరితపించిన కుదిరామ్ ను చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవారు. తన 16 ఏళ్ల వయసులోనే పోలీస్ స్టేషన్ దగ్గర బాంబులు పెట్టి ముగ్గురు బ్రిటీష్ అధికారులను హతమార్చాడు.

Advertisement

Advertisement


ఆ తర్వాత 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు.. విప్లవకారులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన మెజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్ట్ ను హ* చేయాలనుకున్నాడు. అతడిని చంపడం కోసం ఓ ప్లాన్ వేశాడు కుదిరామ్. దాన్ని అమలు కూడా చేశాడు. ఆ దాడిలో కింగ్స్ ఫోర్ట్ తప్పించుకున్నాడు. కానీ అతని భార్య, పిల్లలు మృతి చెందారు. కుదిరామ్ పై రెండు కేసులు నమోదైన కారణంగా అతడికి ఉ* శిక్ష విధించారు బ్రిటిష్ అధికారులు. ఆగస్టు 11, 1908న కుదిరామ్ ను ఉరితీశారు. అతడికి ఉరి తీసినప్పుడు కుదిరామ్ బోస్ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కుదిరామ్ బోస్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

 జెండా ఎగురవేసే సమయంలో చేయకూడని తప్పులు ఇవే..!

స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో వచ్చిన మొట్ట మొదటి సినిమా ఏదో తెలుసా ?

Visitors Are Also Reading