Home » ఎన్టీఆర్ ఫ్యామిలీకి విజ‌య‌శాంతి భ‌ర్త‌కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి మీకు తెలుసా..?

ఎన్టీఆర్ ఫ్యామిలీకి విజ‌య‌శాంతి భ‌ర్త‌కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

విజ‌య‌శాంతి సినీ ఇండ‌స్ట్రీలో ప‌లు పాత్ర‌ల్లో న‌టిస్తూ ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా ఆమెను లేడీ సూప‌ర్ స్టార్ అని పిలిచేవారు. త‌న యాక్ష‌న్‌తో స్ట్రీట్ ఫైటర్ అవ‌తారం ఎత్తిన ఈ మ‌గ‌రాయుడు భార‌త‌నారిగా త‌న క‌ర్త‌వ్యం నెర‌వేర్చిన పెంకి పెళ్లాం కూడా గ్లామ‌ర్‌కి గ్రామ‌ర్ నేర్పిన లేడీబాస్ ఒసేయ్ రాముల‌మ్మ‌గా దుర్మార్గుల‌ను ప్ర‌తిఘ‌టించిన ఈ అరుణ కిర‌ణం త‌న న‌ట‌న‌తో చ‌రిత్ర‌నే క్రియేట్ చేసింది. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉండ‌గానే శ్రీ‌నివాస్ ప్రసాద్ అనే వ్య‌క్తిని పెళ్లిచేసుకుంది.

 

Advertisement

ఆయ‌న‌కు నంద‌మూరి ఫ్యామిలీకి మంచి అనుబంధ‌మే ఉండేది. యాక్ష‌న్ ఓరియెంటేడ్ సినిమాల‌తో లేడీ అమితాబ్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇక విజ‌య‌శాంతి పేరు చెబితే తెర‌పై ఆమె చేసిన పోరాటాలే కాదు. ఆమె చేసిన పాత్ర ఏదైనా స‌రే అద్భుత‌మైన ఫ‌ర్పామెన్స్ ప్ర‌ద‌ర్శించేవారు. ఇటు గ్లామ‌ర్‌, అటు అటు ఫ‌ర్పామెన్స్ ఓరియంటేడ్ సినిమాల్లో న‌టిస్తూనే.. ఆడియ‌న్స్ చేత విశ్వ‌న‌ట భార‌తిగా పిలిపించుకుంది విజ‌య‌శాంతి.

1964 జూన్ 24న వ‌రంగ‌ల‌లో పుట్టింది. ఆమె అస‌లు పేరు శాంతి. తెర‌పేరులోని విజ‌య‌ను త‌న పిన్ని విజ‌య‌ల‌లిత పేరు నుండి తీసుకున్న‌ది. హీరోయిన్ గా విజ‌య‌శాంతి తొలి సినిమా 1979లో వ‌చ్చిన క‌ల్లుక్కుళ్ ఈర‌మ్ అనే త‌మిళ సినిమాలో న‌టిచేట‌ప్పుడు ఆమె వ‌య‌స్సు 15 సంవ‌త్స‌రాలు. మాతృభాష తెలుగులో ఆమె యాక్ట్ చేసిన తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా న‌టిగా విజ‌య‌శాంతికి మంచి మార్కులే కొట్టింది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను చేసిన విజ‌య‌శాంతికి న‌టిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా నేటి భార‌తం ఈత‌రం ఫిలింస్ ప‌తాకంపై టి.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం న‌టిగా విజ‌య‌శాంత‌కి మంచి బ్రేకిచ్చింది. ఇక ఆ త‌రువాత ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అప్ప‌టికే జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద త‌మ అభిన‌యంతో శ్రీ‌దేవి, మాధ‌వి త‌మ అంద‌చందాల‌తో తెలుగుతెర‌ను ఏలుతున్న రోజుల్లో న‌టిగా విజ‌య‌శాంతి సినీ ప్ర‌స్థానం ప్రారంభం అయింది. క‌థానాయిక‌లుగా స్థిర‌ప‌డిన వారిని స‌వాల్ చేస్తూ.. విజ‌య‌శాంతి విజృంభ‌ణ కొన‌సాగించింది.

Advertisement

విజ‌య‌శాంతి త‌న కెరీర్‌లో ముఖ్యంగా చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌తో ఎక్కువ‌గా న‌టించింది. గ‌త న‌ల‌భై ఏళ్లుగా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూనే ఉంది. విజ‌య‌శాంతి భ‌ర్త శ్రీ‌నివాస్ ప్ర‌సాద్ పెద్ద‌ల్లుడు, గ‌ణేష్‌రావుకు స్వ‌యాన మేన‌ల్లుడు. ఈయ‌న‌ హీరో బాల‌కృష్ణ స్నేహితులు. వీరి స్నేహంత‌నే బాల‌య్య‌తో ఓ సినిమాను నిర్మిచాల‌నుకున్నారు. ఇక బాల‌కృష్ణ‌తో యువ‌ర‌త్న ఆర్ట్స్ స్థాపించి ఏ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నిప్పుర‌వ్వ సినిమాను చిత్రీక‌రించారు. అందులో హీరోయిన్‌గా ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు విజ‌య‌శాంతిని ఎంపిక చేశారు. ఆ చిత్రంలో న‌టించేందుకు ప్ర‌సాద్ స్వ‌యంగా విజ‌య‌శాంతి వ‌ద్ద‌కు వెళ్లారు. అలా వారి మ‌ధ్య ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారి పెళ్లికి దారి తీసింది. ఈయ‌న నిర్మాత‌గా బాల‌య్య‌తో క‌లిసి నిప్పుర‌వ్వ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజీగా నిలిచింది. బాల‌య్య విజ‌య‌శాంతి కాంబోలో వ‌చ్చిన చివ‌రి సినిమా ఇదే కావ‌డం విశేషం.

Also Read : 

ఛత్రపతి సినిమాలో ఆ సీన్ నచ్చకపోయినా రాజమౌళి ఎందుకు ఛత్రపతి సినిమాలో పెట్టాడు ?

ఆ సినిమా షూటింగ్ కోసం ఎందుకు రాజశేఖర్ విలన్ రామి రెడ్డిని బట్టలు విప్పి మరీ రోడ్ పై కొట్టాడు.. ?

Visitors Are Also Reading