Home » ఆ సినిమా షూటింగ్ కోసం ఎందుకు రాజశేఖర్ విలన్ రామి రెడ్డిని బట్టలు విప్పి మరీ రోడ్ పై కొట్టాడు.. ?

ఆ సినిమా షూటింగ్ కోసం ఎందుకు రాజశేఖర్ విలన్ రామి రెడ్డిని బట్టలు విప్పి మరీ రోడ్ పై కొట్టాడు.. ?

by AJAY
Ad

యాంగ్రీయంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ అంటే ఇప్ప‌టి త‌రంలో పెద్ద‌గా క్రేజ్ లేక‌పోవ‌చ్చు. కానీ అప్ప‌ట్లో మాత్రం రాజ‌శేఖ‌ర్ కు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఫ్యామిలీ చిత్రాలు అయినా యాక్ష‌న్ సినిమాలు అయినా రాజ‌శేఖ‌ర్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేవారు. టాప్ 4 హీరోల‌లో రాజ‌శేఖ‌ర్ కూడా ఒక‌రిగా ఉండేవారు. రాజ‌శేఖ‌ర్ చాలా సినిమాల్లో న‌టించారు. కానీ ఆయ‌న‌కు అంకుశం సినిమాతోనే ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ద‌ర్శ‌కుడు కోడి రామకృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

కోడిరామకృష్ణ‌కు పోలీసులు అన్నా వాళ్లు ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డే తీరు అన్నా చాలా గౌరవం ఉండేది. కానీ ప్ర‌జ‌లు మాత్రం రాత్రింబ‌వ‌ల్లు క‌ష్ట‌ప‌డుతున్న పోలీసులకు గౌర‌వం ఇవ్వ‌కుండా పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ఎందుకు గౌర‌వం ఇస్తున్నారు…దాన్ని మార్చాలి అనుకున్నారు. త‌న మ‌న‌సులో ఓ ఆలోచ‌న రావ‌డంతో అదే స్క్రిప్ట్ గా రాసుకున్నాడు. ఆ సినిమానే అంకుశం…ఇక ఆ క‌థ‌ను రాసుకుంటున్న స‌మ‌యంలోనే కోడి రామ‌కృష్ణ మొద‌డులో రాజ‌శేఖ‌ర్ తిరుగుతున్నార‌ట‌.

Advertisement

ఈ క‌థ‌కు రాజశేఖ‌ర్ త‌ప్ప మ‌రో హీరో సెట్ అవ్వ‌డ‌ని నిర్ణ‌యించుకున్న కోడి రామ‌కృష్ణ రాజ‌శేఖ‌ర్ కు క‌థ‌ను వినిపించారు. క‌థ విన్న వెంట‌నే బాగా న‌చ్చ‌డంతో రాజ‌శేఖ‌ర్ భావోద్వేగానికి లోన‌య్యారు. ఖ‌చ్చితంగా మ‌నం ఈ సినిమా చేస్తున్నాం…ఈ సినిమా కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌తా అంటూ కోడిరామృష్ణ‌కు చెప్పారు. సినిమా షూటింగ్ ప్రారంభించిన త‌ర‌వాత న‌టీన‌టుల‌ను ఫిక్స్ చేశారు.

విల‌న్ పాత్ర‌కోసం రామిరెడ్డిని సెల‌క్ట్ చేయ‌డం అయితే యాదృశ్చికంగా జ‌రిగింది. షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో రామిరెడ్డి అక్క‌డ తిరుగుతూ క‌నిపించాడు. దాంతో త‌న సినిమాకు అత‌డు విల‌న్ గా సెట్ అవుతాడ‌ని అనిపించింది. ఇక విల‌న్ గా చేస్తావా అని అడగ్గానే న‌టిస్తాన‌ని ఒప్పుకున్నాడు. కానీ ఫ‌స్ట్ సీన్ లో చార్మినార్ వ‌ద్ద బ‌ట్ట‌లు ఊడ‌దీసి రామిరెడ్డిని పోలీసులు కొట్టేసీన్. ఆ సీన్ లో న‌టించ‌లేక నేను చేయ‌లేన‌ని చెప్పేశాడు. కానీ సినిమా త‌ర‌వాత నువ్వు పాపుల‌ర్ అవుతావ‌ని చెప్ప‌డంతో సరేనన్నారు. మ‌రుస‌టి రోజు మ‌ళ్లీ సేమ్ సీన్ రామిరెడ్డిని రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొట్టుకుంటూ తీసుకెళ్లాలి. ఇక ఈ సీన్ చేస్తున్న‌ప్పుడు రాజ‌శేఖ‌ర్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే కొడ్డాడు. దాంతో రామిరెడ్డి బెదిరిపోగా నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి అత‌డికి ధైర్యం చెప్పార‌ట‌. అలా తెర‌కెక్కిన అంకుశం రామిరెడ్డికి విల‌న్ గా రాజ‌శేఖ‌ర్ కు హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.

Visitors Are Also Reading