Home » ఛత్రపతి సినిమాలో ఆ సీన్ నచ్చకపోయినా రాజమౌళి ఎందుకు ఛత్రపతి సినిమాలో పెట్టాడు ?

ఛత్రపతి సినిమాలో ఆ సీన్ నచ్చకపోయినా రాజమౌళి ఎందుకు ఛత్రపతి సినిమాలో పెట్టాడు ?

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. అయితే ప్ర‌భాస్ కెరీర్ లో చేసిన సినిమాల్లో మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఛ‌త్ర‌ప‌తి. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ప్ర‌భాస్ కెరీర్ ఓ మంచి సినిమాగా నిలిచిపోయింది. ప్ర‌భాస్ ఈశ్వ‌ర్ సినిమా చేస్తున్న స‌మ‌యంలో రాజమౌళి స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా పూర్తిచేసి కాళీగా ఉన్నాడు. ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని రాజ‌మౌళి అప్పుడే అనుకున్నాడు. కానీ అది కుద‌ర‌లేదు..ఆ త‌వ‌రాత ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీ అయ్యారు.

Advertisement

రాజ‌మౌళి సింహాద్రి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీసిన త‌ర‌వాత కూడా ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయాల‌ని అనుకున్నా అది కూడా కుద‌ర‌లేదు. మూడోసారి రాజ‌మౌళి, ప్ర‌భాస్ క‌లిసి సినిమా చేయాల‌ని అనుకున్నారు. ఆ సినిమానే ఛ‌త్ర‌ప‌తి. అమ్మ సెంటిమెంట్ మ‌రియు యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలోని చాలా సీన్లు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యాయి.

Advertisement

chatrapathi

chatrapathi

ముఖ్యంగా ఈ సినిమాలో కాట్రాజ్ ప్ర‌భాస్ ల మ‌ధ్య ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. కాట్రాజ్ పాత్ర కోసం రాజ‌మౌళి ముందుగా కొంత‌మందిని స్క్రీన్ టెస్ట్ చేశాడు. ప్ర‌భాస్ క‌టౌట్ కు స‌రిపోయేలా ఉండాల‌ని అనుకున్నాడు. చివ‌రికి సై సినిమాలో 10 మందిలో ఒక‌డిగా ఉన్న సుప్రీమ్ ను సెల‌క్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ మాత్రం రాజ‌మౌళికి న‌చ్చ‌లేద‌ట‌.

ఈ సీన్ కోసం ఎన్నో ప్యాచ్ వ‌ర్క్ లు కూడా చేశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ జ‌క్క‌న్న‌కు ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ మాత్రం న‌చ్చ‌లేదట‌. దాంతో అలానే విడుద‌ల చేశారు. కానీ సినిమా మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా యూనిట్ ను రాజ‌మౌళిని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇక ప్ర‌స్తుతం ఛ‌త్ర‌పతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్నాడు.

Visitors Are Also Reading