Home » జల్సా మూవీలో సరిహద్దు రాయికి కత్తికి ఉన్న లింక్ గురించి మీకు తెలుసా ? 

జల్సా మూవీలో సరిహద్దు రాయికి కత్తికి ఉన్న లింక్ గురించి మీకు తెలుసా ? 

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే  వీరి కాంబినేషన్ లో వచ్చిన  అజ్ఞాతవాసి కాస్త నిరాశ పరిచినప్పటికీ జల్సా , అత్తారింటికి దారేది సినిమాలు ఎంతటి సంచలన విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. వీరి కాంబో మొదటి సారి వచ్చిన జల్సా సినిమా చాలా మందికి ఫేవరేట్ గా నిలిచింది. ఇందులో ఉన్న డైలాగ్ లు, ఫైట్లు, పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. 

Advertisement

ఈ మూవీలో పవన్ కళ్యాణ్-ఇలియానా జంటగా నటించారు. పార్వతి మెల్టన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. అంతేకాదు.. కొన్ని సీన్ల మధ్య లింక్ కూడా ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సంజయ్ సాహో పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ ఓ సారి తన స్నేహితుడికి బాధలు చెప్పుకుంటూ కోపంగా వెళ్లి పాతి పెట్టి ఉన్న సరిహద్దు బండను కాలితో తన్ని పైకి తీస్తాడు. అంతేకాదు.. కంటికి కూడా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు. కంటికి కనిపించని శక్తి ఏదో భూమిలోకి టన్నుల బరువుతో భూమిలోకి తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది అంటాడు.

Advertisement

ఇక ఆ తరువాతే సరిహద్దు రాయిని చాలా బలం పెట్టి పైకి లేపుతాడు. ఆ తరువాత భయం, డిప్రెషన్ పోయి హ్యాపీగా అయిపోతాడు. ప్రీ క్లైమాక్స్ లో విలన్ తో మాట్లాడుతూ.. టన్నుల కొద్ది భయాన్ని పరిచయం చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అదేవిధంగా క్లైమాక్స్ లో విలన్ దామోదర్ కాలిపై  కత్తిని చాలా బలంగా దింపుతాడు. దామోదర్ ని అక్కడ నుంచి తీసుకెళ్లినా కత్తిని మాత్రం రోడ్డుపై నుంచి తీయలేకపోతారు. దీంతో క్లైమాక్స్ లో కత్తిని అలాగే చూపిస్తారు. అక్కడ హీరో టన్నుల బరువు బయటికీ తీస్తే.. ఇక కత్తి సీన్లో మాత్రం టన్నుల బరువును భూమిలోకి పంపిస్తాడు. అలా ఈ రెండు సీన్లను త్రివిక్రమ్ బలే సింక్ చేశాడు. కానీ ఈ సీన్ మధ్య ఉన్న లింక్ ఇప్పటికీ చాలా మందికి అర్థం కాలేదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

జపాన్ లో మనుషులు ఎందుకు అంత సన్నగా ఉంటారో తెలుసా? అసలు కారణం ఇదే!

బాబు బాగా బిజీ మూవీ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading