Home » ఆర్.నారాయణమూర్తి చేసిన గుప్త దానాల గురించి మీకు తెలుసా ?

ఆర్.నారాయణమూర్తి చేసిన గుప్త దానాల గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

సాామాన్య ప్రజలే తన సినిమాకి పెద్ద ఆస్తి. వాళ్ల కష్టాలే ఆయన సినిమాలోని కథ. ఒక దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నా తాను అనుకున్నది వెండి తెరమీద ఆవిష్కరించడమే నారాయణమూర్తి స్టైల్. సాధారణంగా స్టార్ నటీనటులు ఎందరో ఉన్నా కూడా ఆయనను మాత్రమే చాలా మంది మాట్లాడడానికి స్టేజీపై పిలుస్తారు. ప్రత్యేక ఆహ్వానం పంపిస్తారు. సినిమాలను సినిమా తీస్తూ కోట్లు సంపాదిస్తున్న ఎంతో మంది ఆయనను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. 

Advertisement

తాను సంపాదించే ప్రతీ రూపాయి జనం కోసం ఖర్చు చేసే మహనీయుడు బడుగు, బలహీన వర్గాల కోసం మాత్రమే సినిమాలు తీస్తాడు. కోట్లు కుమ్మరిస్తాను అన్నా కూడా ఆయన కమర్షియల్ కోట్లు కుమ్మరిస్తాను అన్నా కూడా ఆయన కమర్షియల్ సినిమాల్లో నటించారు. అందుకు ఉదాహరణ ఆయన వదిలేసినా టెంపర్ సినిమాలో పోసాని మురళి పాత్ర. ఎన్టీఆర్ స్వయంగా అడిగినా కూడా ఆయన ఒప్పుకోలేదంటే ఆయన విలువలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం సినిమాల్లో నటిస్తే సరిపోదు అందుకే ఆయనే కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, చివరికీ నిర్మాణం కూడా చేస్తాడు. అలా అని పెద్ద ప్లానింగ్ తో కూడా సినిమాలు తీయడు.

R Narayana Murthy

Advertisement

తానే నిర్మించి తానే అన్ని చేస్తాడు. సేవ చేయాలన్నా, దానాలు చేయాలన్నా తెలుగు సినిమా నుంచి ముందు ఉండే వ్యక్తి ఆర్. నారాయణ మూర్తినే. అతను చేసిన గుప్త దానాల గురించి ఏ పేపర్ లో కూడా రాదు.. ఎక్కడ చదవరు. ఎందుకంటే ఆయనకు ప్రచారం అవసరం లేదు. ఓరోజు తుఫాన్ బాధితుల కోసం సినీ సెలబ్రిటీస్ అంతా ఒక చోట క్రికెట్ బ్యాట్ వేలం పాటలో పాల్గొన్నారు. చిరంజీవి నుంచి ఎంతో మంది పెద్దలు ఆ వేలం పాటలో పాల్గొనగా.. అందరూ రూ.5వేలు, రూ.10వేలు పాడుతుంటే.. గంభీరమైన గొంతుతో తన అకౌంట్ లో ఉన్న రూ.5 లక్షలతో ఒకే మాట చెప్పి బ్యాట్ ని సొంతం చేసుకుని స్టార్ హీరోలందరి మొహాలు మాడిపోయేలా చేశాడు.    

Also Read :   మీన భర్త విద్యాసాగర్ చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా ?

Manam News

ఆర్. నారాయణ మూర్తి తల్లిని ఏం కావాలో కోరుకో అమ్మ అని అడిగితే ఆ తల్లి తన ఏమి అడగకుండా ఊరి కోసం రామాలయం కట్టించమని చెబితే తన సొంత డబ్బుతో రామాలయం కట్టించాడు. ఆంజనేయస్వామి గుడికి, స్కూల్ కోసం భారీగానే విరాళం అందజేశాడు. అదేవిధంగా తన వాటా కింద వచ్చిన రూ.12 ఎకరాల భూమిని సైతం ప్రజలకు పంచిపెట్టిన మహానీయుడు ఆర్. నారాయణ మూర్తి. సాారణంగా కోట్ల రూపాయలుంటే ఎవరైనా దానాలు చేస్తారు. కానీ చేతిలో ఉన్న ఆఖరు రూపాయిని కూడా దానం చేసేవాడే గొప్పవాడు. అలాంటి వారిలో నారాయణమూర్తి తప్పకుండా ఉంటాడనే చెప్పాలి.  

Also Read :  ఆ టాలీవుడ్ లెజండ‌రీ న‌టుడు యాక్ట‌ర్ బెన‌ర్జీ తండ్రి అన్న సంగ‌తి తెలుసా..?

Visitors Are Also Reading