Home » ఆ టాలీవుడ్ లెజండ‌రీ న‌టుడు యాక్ట‌ర్ బెన‌ర్జీ తండ్రి అన్న సంగ‌తి తెలుసా..?

ఆ టాలీవుడ్ లెజండ‌రీ న‌టుడు యాక్ట‌ర్ బెన‌ర్జీ తండ్రి అన్న సంగ‌తి తెలుసా..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది న‌టీన‌టుల‌ కుటుంబ స‌భ్యులు కూడా న‌టులుగా రానిస్తున్నారు. అయితే వాళ్ల మ‌ధ్య ఉన్న సంబంధాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. స్టార్ హీరోలు హీరోయిన్ ల కుటుంబ స‌భ్యులు ఇండ‌స్ట్రీలో ఉంటే అంద‌రికీ తెలిసిపోతుంది …కానీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల కుటుంబ స‌భ్యుల వివ‌రాలు మాత్రం పెద్దగా బ‌య‌ట‌కు రావు. అదే విధంగా టాలీవుడ్ లో చాలా సినిమాల‌లో న‌టిస్తున్న న‌టుడు బెన‌ర్జీ తండ్రి కూడా లెజండ‌రీ న‌టుడు అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.

Advertisement

బెనర్జీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల‌లో ఎక్కువగా న‌టిస్తూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. వంద‌ల చిత్రాల‌లో వివిధ పాత్ర‌ల‌లో బెన‌ర్జీ న‌టించాడు. అంతే కాకుండా త‌న నాచుర‌ల్ న‌ట‌న‌తో బెన‌ర్జీ మెప్పించ‌డంతో స్టార్ హీరోల సినిమాల‌లో సైతం ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాడు. పాత్ర ఏదైనా కానీ బెన‌ర్జీ త‌న న‌ట‌న‌కు న్యాయం చేస్తాడు.

Advertisement

ఇక బెన‌ర్జీ తండ్రి విష‌యానికి వ‌స్తే….టాలీవుడ్ లో లెజండరీ న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాఘ‌వ‌య్య ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న బెన‌ర్జీ తండ్రి అనే సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. రాఘ‌వ‌య్య చాలా సినిమాలలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

న‌టుడు రాఘ‌వ‌య్య త‌న కుమారుడు బెన‌ర్జీ చిన్న త‌నంలో ఉన్న స‌మ‌యంలో ఇన్ఫ‌ర్మేష‌న్ మ‌రియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ‌లో మంత్రిగా పనిచేశారు. ఆ స‌మ‌యంలో ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి వెళ్లాల్సి వ‌చ్చింది. అంతే కాకుండా బెన‌ర్జీకి సినిమాల్లో న‌టించాలాని చెప్పింది కూడా ఆయ‌న తండ్రిగారే. అలా తండ్రి వార‌స‌త్వంగా వ‌చ్చిన బెన‌ర్జీ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading