Home » ఐపీఎల్ మెగా వేలంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన‌ కావ్య‌మార‌న్ గురించి తెలుసా..?

ఐపీఎల్ మెగా వేలంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన‌ కావ్య‌మార‌న్ గురించి తెలుసా..?

by Anji
Ad

ఐపీఎల్ 2022 సీజ‌న్ మెగా వేలం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో వేలం నిర్వ‌హించారు. ఈ వేలం స‌మ‌యంలో స్టార్ ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయ‌ల ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ ఫ్రాంచైజీ స‌న్ రైజ‌ర్స్ మోస్ట్ ప‌వ‌ర్‌పుల్ గా తీర్చిదిద్దేందుకు టాప్ ప్లేయ‌ర్ల‌ను క‌నివినీ ఎరుగ‌ని రీతిలో ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. ఈ ఆక్ష‌న్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వెస్టిండిస్ వికెట్ కీప‌ర్, బ్యాట్స్‌మెన్ నికోల‌స్ పూర‌న్‌ను చాలా ఎక్కువ మొత్తంలో సొంతం చేసుకుంది.

Also Read :  అప‌రిచితుడు సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడంట మీకు తెలుసా..?

Advertisement

నికోల‌స్ క‌నీస ధ‌ర కేవ‌లం 1.5 కోట్లు మాత్ర‌మే అయితే అత‌న్ని రూ.10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అదేవిధంగా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు రూ.8.75 కోట్లు, భువ‌నేశ్వ‌ర్‌కు 4.20 కోట్లు, న‌ట‌రాజ‌న్ రూ.4కోట్లు కొనుగోలు చేసింది. ఈ వేలంలో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుకు అమ్ముడైన ప్లేయ‌ర్ల కంటే వాళ్ల‌ను కొనుగోలు చేసిన కావ్య‌మార‌న్ అనే యువ‌తి ఎక్కువ‌గా అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈమె ఎవ‌రు అని చాలా మంది ఆరా కూడా తీస్తున్నాడు.

Advertisement

ఇంత‌కు ఈమె అలాగే స‌న్‌టీవీ గ్రూప్ అధినేత క‌ళానిధి మార‌న్ కుమార్తె తెలుగుతో స‌హా మిగ‌తా భాష‌ల్లో కూడా స‌న్ నెట్ వ‌ర్క్ విస్త‌రించిన విష‌యం తెలిసిందే. స‌న్ టీవీ నెట్ వ‌ర్క్ లిమిటెడ్‌, 32 టీవీ ఛానెల్‌లు, 45 ఎఫ్ఎం రేడియో స్టేష‌న్‌ల‌లో భార‌త‌దేశ అతిపెద్ద టెలివిజ‌న్ నెట్ వ‌ర్క్‌ల‌లో ఒక‌టి రాణిస్తుంది. ఈ త‌రుణంలోనే స‌న్‌టీవీ నెట్‌వ‌ర్క్ అధినేత కుమార్తె అయిన కావ్వ ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ అంద‌మైన యువ‌తి ఎవ‌ర‌ని చాలా మంది నెటిజ‌న్లు కూడా సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. గ‌తంలో కూడా మిస్ట‌రీ గ‌ర్ల్‌గా ఈమె సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇప్పుడు త‌న టీమ్ కోచ్‌లు టామ్ మూడీ, ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌ల‌తో క‌లిసి వేలంలో పాల్గొన్న ఆమె ఇప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారింది.

Read Also :  జ‌గ‌న్ తో చిరంజీవి భేటీపై చంద్ర‌బాబు కామెంట్స్..!

Visitors Are Also Reading