Home » జ‌గ‌న్ తో చిరంజీవి భేటీపై చంద్ర‌బాబు కామెంట్స్..!

జ‌గ‌న్ తో చిరంజీవి భేటీపై చంద్ర‌బాబు కామెంట్స్..!

by AJAY
Ad

సినిమా ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఇత‌ర సినీపెద్ద‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ భేటీలో చిరంజీవి జ‌గ‌న్ ను చేతులు జోడించి వేడుకోవ‌డం పై ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిరంజీవి అభిమానులు ఆయ‌న రిక్వెస్ట్ చేస్తున్న సీఎం నోరు మెద‌ప‌కుండా కూర్చోవ‌డం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌లువురు సినీప్ర‌ముఖులు కూడా సీఎం జ‌గ‌న్ తీరును త‌ప్పుప‌ట్టారు.

Advertisement

Advertisement

ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చిరంజీవి జ‌గ‌న్ వ‌ద్ద అలా వేడుకోవ‌డం త‌న‌ను బాదించింద‌ని అన్నారు. తాజాగా ఈ అంశంపై చంద్ర‌బాబు కూడా స్పందించారు. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను జ‌గ‌న్ కించ‌ప‌రిచార‌ని చంద్ర‌బాబు అన్నారు. స్వ‌యం కృషితో ఎదిగిన చిరంజీవి లాంటి వాళ్లు జ‌గ‌న్ ను ప్రాదేయ‌ప‌డాలా అంటూ చంద్రబాబు ప్ర‌శ్నించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని జ‌గ‌న్ వ‌దిలేశారని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదాపై మీ యుద్దం ఏమైందంటూ సీఎం ను చంద్ర‌బాబు నిల‌దీశారు.

Visitors Are Also Reading