Home » అప‌రిచితుడు సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడంట మీకు తెలుసా..?

అప‌రిచితుడు సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడంట మీకు తెలుసా..?

by Anji

ఒక మ‌నిషి ఐదు పైస‌లు లంచం తీసుకుంటే త‌ప్పా.. త‌ప్పుకాద‌న్న 500 మంది 5 పైస‌లు లంచం తీసుకున్నా అదీ త‌ప్పు కాద‌న్నా 5 కోట్ల మంది 5 పైస‌లు తీసుకుంటే పెద్ద త‌ప్పేన‌న్నా శంక‌ర్ ఆలోచిస్తున్నాడు.

అవ‌న్ని చిన్న చిన్న నిర్ల‌క్ష్యాలే పెద్ద ఓడ‌ను ముంచేస్తుంద‌ని ఈ ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు. మ‌న‌దేశం ఎటుపోతుంది. ఇండియా ఓ స్టేట్ అంతా ఉండే సింగ‌పూర్ అభివృద్ధిలో మ‌న‌కంటే ముందుంది. ఎందుకు ఏదో జ‌రుగుతుంది. ఏదో జ‌ర‌గాలి. రాక్ష‌సుల్ని అంత‌రించేందుకు దేవుడు అవ‌త‌రించిన‌ట్టుగా ఈ అవినీతిని అల‌స‌త్వాన్ని నిర్ల‌క్ష్యాన్ని రూపేమాపేందుకు ఓ శ‌క్తి కావాలి.

Also Read :  బాలయ్య పెళ్లికి రానని చెప్పిన ఎన్టీఆర్… కారణం ఏంటో తెలుసా…!

ఇంత‌కు ఎవ‌రు అత‌ను. అత‌ను ఒక్క‌డే కానీ ముగ్గురు కాసేపు ట్రెడిషన‌ల్‌, ఇంకాసేపు మోడ‌ల్‌, మ‌రికాసేపు రెబ‌ల్ ఇలా త్రిబుల్ రోల్‌కాదు. ఒకే మ‌నిషి ముగ్గురిలా క‌నిపిస్తాడు. అది ఒక మాయ రోగం. ఆ రోగ‌మే స‌మాజాన్ని ప‌ట్టి పీడీస్తున్న రోగాన్ని త‌గ్గిస్తోంది. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు శంకర్ అప్ప‌టికే 7 సినిమాలు తీశాడు. కానీ ఏ సినిమాకు ఇంత టెన్ష‌న్ ప‌డ‌లేద‌ట‌. సుజాత రంగ‌రాజ‌న్ ఈజీగా స్టోరీ రాశారు. కానీ దానికి స్క్రీన్ ప్లే రాయ‌డానికి 4 రెట్లు టెన్ష‌న్ ప‌డ్డాడు శంక‌ర్‌. ముఖ్యంగా సీన్లు మార్చాడు. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్లు మారుస్తున్నాడు.

ముఖ్యంగా బాయ్స్ సినిమా తీసే సంద‌ర్భంలో అప‌రిచితుడు సినిమా గురించి ఆలోచిస్తున్నాడు శంక‌ర్‌. తొలుత స్క్రిప్ట్ రజినీకాంత్ చెప్పాడు. ఇంత‌కు ముందు ర‌జినీకాంత్ ఒకేఒక్క‌డు కూడా రిజెక్ట్ చేశాడు. ర‌జినీ నో అన‌గానే వెంట‌నే ఇక విక్రమ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న మెదిలింద‌ట‌. శంక‌ర్ త‌న మ‌న‌సులో అనుకున్న‌ట్టుగానే విక్ర‌మ్ వ‌ద్ద‌కు వెళ్లాడు. విక్ర‌మ్ ఇలాంటి అవ‌కాశం కోస‌మే ఎదురు చూస్తున్నాడు. శంక‌ర్ ఈ క‌థ వినిపించ‌డంతో ఆక‌లితో ఉన్న సింహానికి ఆహారం దొరికిన‌ట్టు అయింది. కానీ డేరింగ్ చేసే నిర్మాత మాత్రం ఎఓవ్వ‌రూ. ఆస్కార్ వి.రవిచంద్ర‌న్ ఇలాంటి వాటికి ఎప్పుడు ముందే ఉంటాడు.

ఐశ్వ‌ర్య‌కు శంక‌ర్‌తో చేయ‌డం ఇష్ట‌మే. కానీ బాలీవుడ్‌లో ఆమె బిజిగా ఉంది. సిమ్రాన్ అడిగారు. అప్పుడు ఆమెకు పెళ్లి కుదిరింది. ఆ త‌రువాత జ‌యంతో హిట్ కొట్టిన స‌ధాను వెతుక్కుంటూ వెళ్లింది. శంక‌ర్ సినిమాలో రెహ‌మాన్ లేకుండా సినిమా తీయ‌డు. కానీ అప‌రిచితుడు సినిమాకు హ‌రీస్ జ‌య‌రాజ్‌ను తీసుకున్నాడు. అదేవిధంగా కెమెరామెన్ శ్రీ‌రామ్ క‌రెక్ట్ కానీ ఆయ‌న పుల్ బిజీగా ఉండ‌టంతో ర‌వివ‌ర్మ‌న్ వ‌చ్చాడు. ముఖ్యంగా ఇక్క‌డ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతుంటే అక్క‌డ విక్ర‌మ్ క్యారెక్ట‌ర్ మోడ‌లింగ్ కోసం హోం వ‌ర్క్ చేసుకుంటున్నాడు.

విక్ర‌మ్ కు అంతా ఒకే కానీ కాస్త పొట్ట పెంచాలి. నెక్స్ మోడ‌ల్‌గా రెడీ అయ్యాడు. వాకింగ్ స్టైల్ మార్చాడు. ఇప్పుడు అప‌రిచితుడు గెట‌ప్ మార్చాలి. బాగుంది కానీ బాగుండాలి. అప‌రిచితుడు సినిమా కోసం విక్రం నిద్ర కూడా పోవ‌డం లేద‌ట‌. భార్య శైల‌జా సైకియాల‌జిస్ట్ ఆమెతో కూర్చుని ప‌ర్సనాలిటీ డిసాస్ట‌ర్ గురించి డిస్‌క‌ర్ష‌న్ చేస్తున్నాడు. 2004 మార్చి 04న ఏవీఎం స్టూడియోలో విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆరునెల‌ల్లో సినిమా పూర్తి చేస్తాన‌ని విక్ర‌మ్ చెప్పారు. ఈ చిత్రంలో ఒక యాక్ష‌న్ ఏపిసోడ్‌కు 127 మంది మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల‌తో చిత్రీక‌రించారు.

మ్యాట్రిక్స్ మూవీకి వాడిన టెక్నాల‌జీని చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో సెట్ వేసి 25 రోజుల పాటు చిత్రీక‌రించారు. అదేవిధంగా అప‌రిచితుడు పబ్లిక్‌తో మాట్లాడే సీన్‌ను హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో తీశారు. ఓ సుకుమారి పాట‌ను నెద‌ర్లాండ్‌లో తీశారు. ఓవైపు కెమెరామెన్ కు బెంగాలీలో ఆఫ‌ర్లు రావ‌డం, మ‌రొక విక్ర‌మ్ కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌చ్చినా అప‌రిచితుడికే ప‌రిమితమ‌య్యాడు. ఈ త‌రుణంలో మొత్తానికి షూటింగ్ పూర్తి చేశారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఉన్నాయి. గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆస్కార్ ర‌విచంద్ర‌న్ కోట్ల‌కు కోట్లు పోస్తున్నాడు. ఫైన‌ల్‌గా 26కోట్ల 38 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయింది.

ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి ఫిలింస్ సుబ్ర‌హ్మ‌ణ్యం 6 కోట్ల 75 ల‌క్ష‌ల‌కు బేరం ఆడాడు. 2005 వేస‌వికాలంలో పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. దీంతో జూన్ 17, 2005న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. 104 ప్రింట్ల‌తో విడుద‌ల చేసిన సినిమా 37 సెంటర్ల‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది. 115 కోట్లు వ‌సూలు చేసింది. విక్ర‌మ్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి ప‌ని చేశారు. మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే ప్రెంచ్ భాష‌లో విడుద‌లైన తొలి భార‌తీయ చిత్రం అప‌రిచితుడు కావ‌డం విశేషం. ఇంత క‌ష్ట‌ప‌డి తీసినందుకు ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చింది.

Also Read :  UDAYKIRAN : మూడు వ‌రుస హిట్ల త‌ర‌వాత బెదిరింపులు..ఉద‌య్ కిర‌ణ్ ఏం చేశాడంటే..!

Visitors Are Also Reading