Home » మన తెలివి తేటలని దెబ్బ తీసే 5 అలవాట్లు మీకు ఉన్నట్లైతే వెంటనే మానేయండి !

మన తెలివి తేటలని దెబ్బ తీసే 5 అలవాట్లు మీకు ఉన్నట్లైతే వెంటనే మానేయండి !

by Sravanthi Pandrala Pandrala

ఇంటెలిజెన్స్ అనేది మనకి స్కూల్ లోనో,కాలేజీలోనూ ఎక్కువ మార్క్స్ రావడం వల్ల వచ్చే బిరుదు కాదు. లైఫ్ లో మనం పాటించే అలవాట్లను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మనల్ని ఇంటెలిజెంట్ అని అంటారు. సాధారణంగా కొన్ని అలవాట్లు పాటిస్తే ఇంటెలిజెంట్ అని అనిపించుకుంటారు. కానీ మన ఇంటెలిజెన్స్ ను దెబ్బతీసే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం పాటించే కొన్ని అలవాట్లు మన ఇంటెలిజెన్స్ ను దెబ్బతీస్తాయి.

1. ఎవరినీ విమర్శించరాదు :వేరే వాళ్ళను క్రిటిసైజ్ చేయడం అనేది ఎవరు కావాలని చేయరు. అదంతే అలా అయిపోతుంది. దీన్ని చాలా మంది సైకాలజీ లు ప్రొటెక్టివ్ స్ట్రాటజీ అంటారు. మన భయాలను మన ఆలోచనలను కాపాడుకోవడానికి వేరే వాళ్ళను క్రిటిసైజ్ చేయడం. కానీ అదే పనిగా వేరేవాళ్లను క్రిటిసైజ్ చేయడంవల్ల అది మన ఇంటెలిజెన్స్ ను దెబ్బతీస్తుంది.

2. అధిక ఖర్చు మానుకోవాలి: అవసరం అలాగే కోరిక ఇవి రెండు చాలా గమ్మత్తైన విషయాలు. తెలివైన వాళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరాలను కోరికలను చాలా సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారు. అందుకే డబ్బును అవసరాలకు ఎక్కువగా వాడడం, కోరికలకు తక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి.

 

3. అధిక నిర్లక్ష్యం: ఇది సినిమాల్లో హీరోలకు బాగానే ఉంటుంది కానీ నిజానికి బయట కూడా అలాగే ఉంటే వాళ్లను చాలా దారుణంగా చూస్తారు. బాధ్యత లేకుండా ఉంటే కూల్ గా ఉండవచ్చు కానీ తెలివైన వారిగా ఉండలేరు. తెలివైన వారికి బాధ్యత గా ఉండడం తెలుసు.

4.గతాన్ని మర్చిపోవాలి: గతం తాలూకు జ్ఞాపకాలలో ఉండకూడదు. గతాన్ని తలచుకుంటూ మన వర్తమానాన్ని పాడు చేసుకోకూడదు. మనం భవిష్యత్తులో పైకి ఎదగాలంటే గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించకూడదు.

5. డ్రాపింగ్ ఐడియాస్: వేరే వాళ్ల గురించి మన ఐడియాలను మార్చుకోకూడదు. అలాగే ఒక ఐడియాను మనం బలంగా నమ్మినప్పుడు దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూటివ్ చేయాలి. అందుకే తెలివైన వాళ్ళు వారి ఐడియాల మీద మొండిగా ఎన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినా కూడా వాళ్ల ఐడియా నే నమ్ముకుని పనిచేస్తారు.  ఈ 5 అలవాట్లే మన ఇంటెలిజెన్స్ ని దెబ్బతీస్తాయి. ఇవి మన లైఫ్ లో గనుక ఉంటే ఆ అలవాట్లను మనం తీసిపారేస్తే మనలో ఉన్న మార్పులను మనం త్వరగా గమనించగలం.

Also Read: ఉత్తరం వైపు తిరిగి పడుకుంటే కలిగే నష్టాలు ఇవేనా..!!

Visitors Are Also Reading