ఉత్తరం వైపు నిద్రించరాదని శాస్త్రాలే కాదు సైన్స్ కూడా చెబుతోంది. ఎందుకో తెలుసా? మన హిందూ సంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకోవడం వాస్తు దోషం అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇలా ఉత్తరం వైపు నిద్రించకూడదు అని శాస్త్రాలే కాదు సైన్స్ కూడా చెబుతోంది. మరి అలా అనడం వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. భూమికి అయస్కాంత క్షేత్రం ఉంటుందని మనం చిన్నప్పుడు చదువుకున్నాం.
Advertisement
ఉత్తర దక్షిణ ధ్రువాలు కూడా ఉంటాయి.ఇవి అయస్కాంత క్షేత్రాల్లా పనిచేస్తాయి. అలాగే మనిషిలో కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ క్రమంలో తలవైపు ఉత్తరదిశ క్షేత్రం, కాళ్ళ వైపు దక్షిణదిశ క్షేత్రం ఉంటుందట. అందుకనే తలను ఉత్తరం వైపు పెట్టకూడదని చెబుతుంటారు. ఎందుకంటే శరీరం పరంగా తల వైపు ఉత్తరదిశ క్షేత్రం ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి భూమిపై ఉండే ఉత్తర దిశ పై పెడితే అప్పుడు సజాతి ధ్రువాలు రెండు వికర్శించుకున్నట్టు అవుతుంది. దీంతో శరీరానికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Advertisement
మన శరీరంలో అత్యంత విలువైన శక్తివంతమైన మెదడు ఆ ఉత్తర దిశలో ఉన్న అయస్కాంత శక్తి ప్రభావంతో మెదడులో ఉన్న కోబాల్ట్, నికెల్, ఐరన్ కణాలను ఆకర్షించడం వలన మెదడులో ఉన్న ప్రభావవంతమైన శక్తిని కోల్పోవడం జరిగి తరచూ పీడకలలు రావడం, అర్ధరాత్రి మెలకువ రావడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉత్తర దిశగా తలను పెట్టి నిద్రించడం వలన అయస్కాంత క్షేత్ర ప్రభావం శరీరంపై పడుతుంది. దీంతో బీపీ పెరుగుతుందట, గుండె సమస్యలు కూడా వస్తాయట. రక్త కణాల్లో రక్తం గడ్డ కడుతుందట. అలాగే పక్షవాతం వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.అందుకే ఉత్తర దిక్కులో తప్ప ఏ దిక్కులో నిద్రించినా ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.
Advertisement
Also Read: మహిళల కోసం పోరాడే డైరెక్టరే.. మోసం చేశారంటూ కన్నీరు పెట్టుకున్న నటి.. ఎవరంటే..!!