Home » సబ్జాగింజలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి లేదంటే ప్రమాదమే..!!

సబ్జాగింజలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి లేదంటే ప్రమాదమే..!!

by Sravanthi
Ad

సబ్జా గింజల లో డైటరీ ఫైబర్, విటమిన్ కె, ఏ, అలాగే ఐరన్ ప్రోటీన్స్,ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో డైటరీ ఫైబర్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ సబ్జా గింజలను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఫైబర్స్ ఉంటాయి కాబట్టి వాటిని కొద్ది పరిమాణంలో తీసుకున్నా కూడా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే శరీరంలో బ్లడ్,షుగర్ స్థాయిలను క్రమ పరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, అలాగే గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీతో బాధపడేవారికి ఈ సబ్జా గింజలు చాలా ఉపయోగ పడుతూ ఉంటాయి.

Advertisement

ముఖ్యంగా వీటిలో విటమిన్ కె ఉండడంవల్ల జుట్టు సమస్య ఉన్నవాళ్లు ప్రతిరోజు ఈ సబ్జా గింజలు తీసుకోవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మారడానికి కూడా ఈ సబ్జా గింజలు చాలా సహాయపడతాయి. సబ్జా గింజలు ఎప్పుడైనా నానబెట్టినవి తీసుకోవాలి. ఎండి పోయినవి తీసుకోకూడదు. అలా ఎండిపోయినవి తీసుకుంటే గొంతులో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒకటి నుంచి రెండు టీ స్పూన్ ల పరిమాణంలో సబ్జా గింజలను తీసుకొని, గోరువెచ్చని నీటిలో వేసి 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత తీసుకోవాలి.

Advertisement

ఆ నానబెట్టిన గింజలను సలాడ్స్ లో కానీ, ఫ్రూట్స్ లో,గ్రీన్ టీ లో లేకపోతే లెమన్ జ్యూస్ లో గానీ వేసుకొని తీసుకోవచ్చు. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు మాత్రం పరిగడుపున ఈ సబ్జా గింజలను తీసుకోవాలి. ఈ సబ్జా గింజల తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ ల సబ్జా గింజల కన్నా ఎక్కువ తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల డయేరియా, వాంతులు, తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గర్భంతో ఉన్న మహిళలు ఈ సబ్జా గింజలను తినకూడదు. ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ తగ్గి, దానివల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ALSO READ :

దోమలు అలాంటి వారిని ఎందుకు ఎక్కువగా కుడతాయి.. కారణం ఇదేనా..!!

బీర్ బాటిల్స్ గోధుమ, ఆకుపచ్చ రంగులోనే ఎందుకు ఉంటాయంటే..!

 

Visitors Are Also Reading