Home » DJ TILLU REVIEW : మోత‌మోగుతున్న “డీజే టిల్లు”..సినిమా ప్ల‌స్లు మైన‌స్లు ఇవే.. !

DJ TILLU REVIEW : మోత‌మోగుతున్న “డీజే టిల్లు”..సినిమా ప్ల‌స్లు మైన‌స్లు ఇవే.. !

by AJAY

సిద్ధూ జొన్నగడ్డల నేహా శెట్టి హీరో హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం డీజే టిల్లు. విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. సిద్దు జొన్న‌గడ్డల పలు చిత్రాల్లో సైడ్ పాత్రలు చేయగా…. గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో సిద్దు కు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా లాక్ సమయంలో సిద్దూ హీరోగా నటించిన పలు చిత్రాలు ఓటీటీలో విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

also read : అతడు సినిమా నుండి ఉదయ్ కిరణ్ తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా ..!

అంతే కాకుండా లాక్ డౌన్ హీరోగా సిద్దూ ఫేమ‌స్ అయ్యాడు. ఇక ఇప్పుడు బ‌డా బ్యానర్ పై ఎన్నో అంచనాల మధ్య డీజే టిల్లు సినిమాతో సిద్దు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చటంతో ముందు నుండి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాలోని డీజే టిల్లు పాట మోత మోగుతోంది.

Dj tillu

Dj tillu

యూత్ ఫుల్ ఎంటర్టైన‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీమియ‌ర్స్ చూసిన నెటిజ‌న్లు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు చెబుతున్నారు. సిద్దు హిట్ కొట్టాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉందని కామెడీ ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెబుతున్నారు. అంతే కాకుండా సినిమా లో బ్రహ్మాజీ పాత్ర నవ్వులు పూయించింద‌ని చెబుతున్నారు.

dj tillu review and rating

dj tillu review and rating

అదేవిధంగా సిద్దు ఆటిట్యూడ్ కూడా బాగుందని డీజే టిల్లు వన్ మ్యాన్ షో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సెకండాఫ్ కాస్త తగ్గిందని ఫస్టాఫ్ మాత్రం చాలా బాగుందని చెబుతున్నారు. హీరోయిన్ నేహాశెట్టి న‌ట‌న కూడా సినిమాకు ప్ల‌స్ గా నిలించింద‌ని చెబుతున్నారు. మ్యూజిక్ కూడా భాగుంద‌ని…పంచ్ డైలాగులు బాగున్నాయ‌ని చెబుతున్నారు. సినిమాను ఒకసారి ఖచ్చితంగా చూడవచ్చని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

 

 

 

Visitors Are Also Reading