Home » “DJ టిల్లు 2″లో మార్పులు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

“DJ టిల్లు 2″లో మార్పులు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సిద్దు జొన్నలగడ్డ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తు వచ్చే సినిమా డీజే టిల్లు.. ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మూడు రెట్లు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం చేపట్టింది. అలాంటి మూవీ పార్ట్ 2 కూడా వస్తుందని డైరెక్టర్ తెలియజేశారు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద షేక్ చేసింది ఈ మూవీ. డీజే టైటిల్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది.

Advertisement

హీరో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సినిమా విజయవంతం కావడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఆయన క్యారెక్టర్ మరిన్ని అద్భుతాలు సృష్టించగలదని భావించిన దర్శక నిర్మాతలు డీజే టిల్లు 2 కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆల్రెడీ ప్రారంభించినట్టు సమాచారం. dj టిల్లు మూవీ లో టిల్లుతో పాటుగా రాధిక పాత్ర చాలా కీలకం. రాధిక పాత్రలో నేహా శెట్టి అలరించింది. అయితే డీజే టిల్లు 2 లో ఈ అమ్మడు కనిపించదట. ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకువస్తున్నారని తెలుస్తోంది. కేవలం అతిథి పాత్రలో మాత్రమే నేహా శెట్టి కనిపించనుందని సమాచారం.

Advertisement

 

డీజే టిల్లు -2 సినిమాl ఇదే ప్రధాన మార్పు అని తెలుస్తోంది. మొదటి భాగంలోని కొన్ని పాత్రలు రెండో భాగంలో కూడా కొనసాగుతాయట. వీటితో పాటుగా మరికొన్ని కొత్త పాత్రలు కూడా వచ్చి చేరుతాయి. వీటిలో ముఖ్యంగా హీరోయిన్ పాత్ర మరీ ముఖ్యమైనది. దీనికోసం గ్లామరస్ హీరోయిన్ కావాలని వారు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోందని తెలుస్తోంది.

ALSO READ:

Visitors Are Also Reading