రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సినిమాల్లో ఆయనకు అనంత క్రేజ్ ఎవరికీ లేదు అనేది నిజం. అయితే సినిమాల నుండి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. దాంతో ఆయనను ఎంతమంది పొగుడుతున్నారో… అంతే మంది తిడుతున్నారు కూడా. సినిమాలో అభిమానులు ఆయనను పవర్ స్టార్ అని పిలుస్తుంటే… ఎక్కువగా రాజకీయాల్లో పవన్ ను ప్యాకేజ్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు వేరే పార్టీ నేతలు.
అయితే పవన్ ను ఇలా ప్యాకేజ్ స్టార్ అని పిలవడంపై టీడీపి మాజీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి స్పందించారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి దివ్యవాణి మాట్లాడుతూ… పవన్ ను విమర్శించే వారి పై ప్రతి దాడికి దిగ్గింది. ఇక పవన్ ను అలా ప్యాకేజ్ స్టార్ అని పిలుస్తుంటే తనకు బాధ కలుగుతుంది అని పేర్కొంది. అలాగే పవన్ ను ప్యాకేజ్ స్టార్ అని ఎవరో అనడం ఏమిటి. ఎందుకంటే పవన్ స్వయంగా ఓ పవర్ ఫుల్ ప్యాకేజ్. కాబట్టి ఆయనను మరొకరు ఎవరు ప్యాకేజ్ చేయగలరు అని పేర్కొంది. ఇక అదే విధంగా తనకు పవన్ కళ్యాణ్ యొక్క భావజాలం అనేది చాలా ఇష్టం అనేది ఆవిడ తెలిపింది.
పవన్ కళ్యాణ్ పాటించే పద్ధతులు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా కంట్రోల్ మనిషి. అనవరసంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడడము. తన శక్తిమేర ఆయన పునరాజాల సమస్యల పైన పోరాడుతున్నారు. ఏదైనా సమస్య ప్రజలకు వచ్చినది అని తెలిస్తే దాని మీద స్పందిస్తున్నారు. అయితే పవన్ కు తనను తాను ఎలా కంత్రోల్ చేసుకోవాలి అనేది బాగా తెలుసు. అందుకు అధికార పార్టీ వారు ఎన్ని కామెంట్స్ చేసిన ఆయన ఓ పద్దతి ప్రకారం వారికీ సమాధానం ఇస్తున్నారు అని దివ్యవాణి పేర్కొంది.
ఇవి కూడా చదవండి :