Home » ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడిన వంటలక్క..!!

ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడిన వంటలక్క..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మొన్నటి వరకు తెలుగు బుల్లితెర సీరియల్స్ లో టాప్ రేటింగ్స్ లో కొనసాగింది కార్తీకదీపం. దీని టిఆర్పి రేటింగ్ ఇండియన్ సీరియల్స్ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఏ సీరియల్ కు రానంతగా ఈ సీరియల్ వ్యువర్షిప్ రాబట్టుకుంది. సోషల్ మీడియానే కాదు ఎక్కడ చూసినా డాక్టర్ బాబు వంటలక్క అనే పేర్లు మోత మోగాయి. ఇప్పుడు వరకు వచ్చిన సీరియల్ లో ఏ సీరియల్ కూడా ఇంత హైలెట్ కాలేదు. 2017లో మొదలైన ఈ సీరియల్ ను ముందుగా ఎవరూ పట్టించుకోలేదు. దాని తర్వాత డాక్టర్ బాబు వంటలక్క అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు..

Advertisement

దర్శకులు తమ సినిమాల్లో వంటలకు డాక్టర్ బాబు పాత్రలతో కామెడీని పుట్టించేంతగా ఈ సీరియల్ వైరల్ అయింది. అలాంటి వంటలక్క సీరియల్లో దీప పేరుతో పరిచయం. కానీ ఈమె అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. కేరళకు చెందిన ప్రేమి వంటలక్కగా తెలుగు వారికి పరిచయమైంది. ఒక్క పాత్రతోనే ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి వంటలక్క సమంత, గౌతమి, రేణు దేశాయ్ వంటి హీరోయిన్ల లాగా ఈమె కూడా ఒక అరుదైన వ్యాధి బారిన పడ్డట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వారు ముఖానికి వేసుకునే రంగులే..

Advertisement

సినిమా, సీరియల్స్ లో నటించాలంటే తప్పనిసరిగా ముఖం నిండా మేకప్ వేసుకోవాల్సిందే. దీనివల్ల రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే వంటలక్క నల్లగా కనిపించడం కోసం నల్లని మేకప్ ని ఎక్కువగా డోస్ తీసుకోవడం వల్ల స్కిన్ సమస్యకు లోనైనట్టు తెలుస్తోంది. ఈ సమస్య వల్ల ఆమె ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయట. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె అనేక ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇదే విషయంపై వంటలక్క ఇప్పటివరకు స్పందించలేదు కానీ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

also read:

Visitors Are Also Reading