Home » ఫస్ట్ సినిమా తోనే ఎన్టీఆర్ ను బీట్ చేసిన చిరంజీవి..? ఆ సినిమా ఏదంటే..?

ఫస్ట్ సినిమా తోనే ఎన్టీఆర్ ను బీట్ చేసిన చిరంజీవి..? ఆ సినిమా ఏదంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న హీరో చిరంజీవి. ఎన్టీఆర్ లానే చిరంజీవి కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తర్వాత ఆయన కుటుంబం నుండి వారసులు వచ్చిన మాదిరిగానే చిరంజీవి ఫ్యామిలీ నుండి సైతం ప్రస్తుతం వారసులు ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. నిజానికి చిరంజీవి కెరీర్ ప్రారంభంలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు.

Advertisement

మొదట విలన్ గా నటించి ఆ తర్వాత హీరో వేషాలను అందుకున్నారు. ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. హీరోగా ఎదుగుతున్న సమయంలో చిరంజీవి ఎన్టీఆర్, కృష్ణ లాంటి హీరోలకు పోటీ ఇచ్చారు. అయితే స్టార్ హీరోగా ఎదగకముందే చిరంజీవి ఎన్టీఆర్ సినిమాను బీట్ చేశారు. ఈ విషయం చాలామందికి తెలియదు. 1981లో ఎన్టీఆర్ చిరంజీవి నటించిన సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి.

Advertisement

కాగా ఆ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ సినిమాపై చిరంజీవి సినిమా విజయం సాధించింది. చిరంజీవి 1991లో చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమాకు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

ఇక అదే ఏడాది అదే నెలలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు హీరోగా కొండవీటి సింహం సినిమా విడుదల అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. కానీ చిరంజీవి నటించిన చట్టానికి కళ్ళు లేవు సినిమా కొండవీటి సింహం సినిమాను బీట్ చేసింది. హైదరాబాదులోని సంధ్యా థియేటర్ లో ఈ సినిమా 107 రోజులు ఆడింది. అదేవిధంగా కొండవీటి సింహం సినిమా థియేటర్ లలో 100 రోజులు ఆడింది.

ALSO READ :Mangli : మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. ఈ సారి ఏం జరిగిందంటే..!

Visitors Are Also Reading