శేఖర్ కమ్ముల ఇటీవల దర్శకత్వం వహించిన చిత్రాలు రెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందులో ఫిదా, లవ్‌స్టోరీ. ఆ రెండింటిలో హీరోయిన్ సాయిపల్లవి నటన చాలా హైలెట్‌గా నిలిచింది. రెండు సినిమాల్లో కూడా తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది బ్యూటీ. ముఖ్యంగా డాన్స్ విషయంలో అయితే అద్భుతమే. అయితే ఫిదా, లవ్‌సోరీ సూపర్ సక్సెస్‌లో తనకు చాలా ప్రాముఖ్యత ఉంది.
Advertisement
Advertisement
ఇక లవ్‌స్టోరీ సినిమా తరువాత ప్రస్తుతం ధనుష్‌తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమా స్టోరీ రైటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ధనుష్‌తో లవ్‌స్టోరీ కాకుండా ఒక సీరియస్ సబ్జెక్ట్‌ను డీల్ చేస్తాడట. తన కొత్త చిత్రంలో సాయిపల్లవి కాకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు అవకాశం ఇవ్వనున్నాడని సమాచారం.
Advertisement
శేఖర్ కమ్ముల మూవీతో సాయిపల్లవి పాన్ ఇంఇయా మార్కెట్‌లోకి అడుగుపెట్టడం ఖాయమనుకుంటుండగానే మరొక హీరోయిన్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోనుండడతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్‌లను తీసుకుంటే సినిమా మార్కెట్ పెరుగుతుందని నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీంతో సాయిపల్లవి తరువాత ఏమిటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నది.