పాత సినిమాలను కొత్తగా విడుదల చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. ఇప్పటికే టెక్నాలజీకి అనుగుణంగా 4 కే రిజల్యూషన్, డాల్బీ ఆటమ్స్ సౌండ్‌తో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో బాగంగానే ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని విడుదల చేశారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4 కే రిజల్యూషన్ తో విడుదల చేసిన ఈ సినిమా మరోసారి అభిమానులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. ప్రస్తుత సినిమాల మాదిరిగానే రీ రిలిజ్ కి కూడా కలెక్షన్లను బాగానే తీసుకొచ్చింది.
Also Read : వ్యాపారం విస్తరించాలని స్టార్ హోటల్ లో వ్యాపారవేత్త ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Advertisement
ఆగస్టు 09న రీ రిలీజ్ అయిన పోకిరి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1.73 కోట్ల బారీ గ్రాస్ వసూలు చేశాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంతు వచ్చింది. సెప్టెంబర్ 02న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో అదే రోజున జల్సా చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ 14 సంవత్సరాలు పూర్తయింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేయనున్నారు.
Advertisement
రోజు రోజుకు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే కొత్త ప్రింట్ పూర్తయినట్టు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేశ్ కొత్త ప్రింట్‌ను చూసినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇక కొత్త ప్రింట్‌లో బాబు కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. మీ సెలబ్రేషన్స్ మొదలుపెట్టండి అని ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. 14 ఏళ్ల కిందట థియేటర్లలో సినిమా చూసిన వాళ్లు, అప్పుడు థియేటర్లలో మిస్ అయిన వారు మరొకసారి జల్సా చేయడానికి సిద్ధమవుతున్నారు.
Also Read : ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న దిల్‌రాజు.. ఒక్కరోజులేనే 36వేల ట్వీట్లు.. అసలు కారణం అదేనా..?
Finished watching #Jalsa in #QUBE
Babu kothaga konna Adham la merisipothunnadu kotha print lo…Sound quality is amazing 🔥🔥 Start ur celebrations…. Shows and Publicity will be organised by Senior fans. Iam not taking any responsibility from here on#SanjaySahuArriving— Sai Rajesh (@sairazesh) August 12, 2022