Home » వ్యాపారం విస్త‌రించాల‌ని స్టార్ హోట‌ల్ లో వ్యాపార‌వేత్త ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

వ్యాపారం విస్త‌రించాల‌ని స్టార్ హోట‌ల్ లో వ్యాపార‌వేత్త ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Anji
Ad

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఐటీ హ‌బ్ చేరుకున్నాడు. త‌న వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని అత‌ని బంధువులు, స్నేహితుల ద‌గ్గ‌ర చెబుతున్నాడు. వ్యాపారం అభివృద్ధి చేసే విష‌యంలో బంధువుల సాయ‌తో ప‌లువురితో చ‌ర్చించాడు. ప్ర‌ముఖ హోట‌ల్‌లో మ‌కాం వేసి ఆ వ్యాపార‌వేత్త ఓ బంధువు స‌హాయంతో ఓ యువ‌తిని అత‌ను ఉంటున్న స్టార్ హోట‌ల్‌కి పిలిపించాడు. ఆ హోట‌ల్లో యువ‌తితో వ్యాపారం విష‌యంలో చ‌ర్చించి ఆమెను ఇంటికి పంపించారు. మ‌రొక సారి వ్యాపారం గురించి చ‌ర్చించాల‌ని హోట‌ల్ కి పిలిపించిన వ్యాపార‌వేత్త త‌న మీద దాడి చేశాడ‌ని ఆ యువ‌తి వ్యాపార‌వేత్త మీద కేసు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.


వివ‌రాల్లోకి వెళ్లితే.. త‌మిళ‌నాడులోని ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త బెంగ‌ళూరులో అత‌ని వ్యాపారం ప్రారంభించాల‌ని చాలా కాలంగా అనుకుంటున్నాడు. త‌న వ్యాపారాన్ని త‌మిళ‌నాడుతో పాటు పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో విస్త‌రించాల‌ని అభివృద్ధి చేయాల‌ని అందుకు మీ స‌హాయ స‌హ‌కారాలు కావాల‌ని చాలా కాలంగా అత‌ని బంధువులు, స్నేహితులు ద‌గ్గ‌ర చెబుతున్నాడు. త‌మిళ‌నాడుకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఐటీ బెంగ‌ళూరు చేరుకున్నాడు. బెంగ‌ళూరులోని క‌బ్బ‌న్ పార్క్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ స్టార్ హోట‌ల్‌లో త‌మిళ‌నాడుకు చెందిన వ్యాపార‌వేత్త బ‌స చేశాడు. వ్యాపారం అభివృద్ది చేసే విష‌యం గురించి చ‌ర్చించాడు.

Advertisement

Advertisement


క‌బ్బ‌న్ పార్కు స‌మీపంలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్లో మ‌కాం వేసిన వ్యాపార‌వేత్త బంధువు సాయంతో బెంగ‌ళూరులో నివాస‌ముంటున్న ఓ యువ‌తిని స్టార్ హోట‌ల్ కి పిలిపించాడు. ఆమెతో వ్యాపారం గురించి చ‌ర్చించాడు. ఆ త‌రువాత కొద్ది రోజుల త‌రువాత మ‌రోసారి వ్యాపారం గురించి చ‌ర్చించాల‌ని ఆ అమ్మాయిని హోట‌ల్ వ‌ద్ద‌కు పిలిపించాడు. ఆ స‌మ‌యంలో వ్యాపార‌వేత్త ఆఅమ్మాయిపై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న‌పై ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ఆ యువ‌తి క‌బ్బ‌న్ పార్కు పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేసింది. ఈ విష‌యం గురించి త‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల‌కు చెప్పాన‌ని.. వారి స‌ల‌హాతో ఆల‌స్యంగా కేసు పెట్టాన‌ని ఆ యువ‌తి పేర్కొంది. త‌మిళ‌నాడుకు పారిపోయిన వ్యాపార‌వేత్త కోసం గాలిస్తున్నామ‌ని.. క‌బ్బ‌న్ పార్కు పోలీసులు పేర్కొంటున్నారు.

Also Read : 

రిష‌బ్ పంత్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన ఆ బాలీవుడ్ న‌టి..!

Visitors Are Also Reading