Home » డైరెక్టర్ మెహర్ రమేష్ వివాదస్పద వ్యాఖ్యలు.. ట్రోలర్స్ ఏమన్నారో తెలుసా ?

డైరెక్టర్ మెహర్ రమేష్ వివాదస్పద వ్యాఖ్యలు.. ట్రోలర్స్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవ్వడం కొత్త ఏమి కాదు. ఆయన దర్శకత్వం వహించిన శక్తి మూవీ అప్పటి నుంచి  ప్రారంభమైన ఈ ట్రోలింగ్ నేటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. వాస్తవానికి మెహర్ రమేష్ ఇన్ని రోజుల పాటు సినిమా రాకుండా ఉండటానికి కారణం సోషల్ మీడియా ట్రోలింగ్ అనే చెప్పాలి. దాదాపు మెహర్ రమేష్ పదేళ్ల గ్యాప్ తరువాత మెగా ఫోన్ చేతిలో పట్టుకొని మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  అయితే ఈ మూవీ తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలపై గత కొద్ది రోజులుగా ఆసక్తి చూపించని ప్రేక్షకులు భోళా శంకర్ ని కూడా తిప్పికొడుతున్నారు. దీనికీ తోడు భోళాశంకర్ మూవీకి సంబంధించిన పాటలు, ట్రైలర్ ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను ఆసక్తి లేకుండా పోయింది.

Advertisement

ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించి ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు 11న విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న మెహర్ రమేష్ వేదాళం మూవీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశఆడు. వేదాళం సినిమా ఒక క్రింజ్ సినిమా అంటూ చెబుతూ. ఆ సినిమాలోని 70 శాతం కథ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా భోళాశంకర్ మూవీని మలిచామని చెప్పారు. దీంతో హీరో అజిత్ అభిమానులు డైరెక్టర్ మెహర్ రమేష్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంత క్రింజ్ సినిమా అయినప్పుడు రీమేక్ ఎందుకు చేస్తున్నారు అంటూ మెహర్ రమేష్ పై మీమర్స్ వేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

Advertisement

దీంతో మరోసారి ట్రోలర్స్ తో ట్రోలింగ్ చేయించుకోవడం ఇష్టం లేని మెహర్ రమేష్ తాజాగా ట్వీట్ ద్వారా ఈ విషయంపై స్పందించారు. 2015లో వేదాళం మూవీ చూశాను. చాలా బాగా నచ్చింది. అన్నాచెల్లెల్ల మధ్య ఉన్న బలమైన బంధాన్ని డైరెక్టర్ శివ సార్ చూపించిన విధానం నచ్చి..ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులందరికీ చూపించాలనుకునే ఉద్దేశంతోనే భోళా శంకర్ మూవీ తీశాను. 2009లో అజిత్ సార్ హీరోగా నటించిన బిల్లా మూవీని ప్రభాస్ తో చేశాను. ఇప్పుడు మళ్లీ అజిత్ సార్ నటించిన మరో మూవీని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. కొద్ది గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుందని మెహర్ రమేష్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రజినీకాంత్ వైసీపీ నేతలను టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ?

Suryakantham and chayadevi : సూర్యకాంతం – ఛాయాదేవి మధ్య ఉన్న ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading