Home » ఒక అమ్మాయిని ప్రేమించి ప‌క్క‌న ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి ల‌వ్ స్టోరీ గురించి మీకు తెలుసా..?

ఒక అమ్మాయిని ప్రేమించి ప‌క్క‌న ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి ల‌వ్ స్టోరీ గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి. టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాదిరిగానే అనిల్ రావిపూడి వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు. తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎఫ్‌-3 సినిమా ఇవాళ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలోనే ఆయ‌న ఈ చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నాడు.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడారు. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాము చ‌దువుకునే రోజుల్లో క‌ళాశాల అయిపోగానే త‌మ బ్యాచ్ మొత్తం మ‌రో న‌లుగురు అమ్మాయిల బ్యాచ్ ను ఫాలో అయ్యేవాళ్లం అని చెప్పారు. ఆ న‌లుగురు అమ్మాయిల‌లో త‌న‌కు ఓ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని.. అందుకే ఆ అమ్మాయికి సైట్ కొట్టేవాడిన‌ని పేర్కోన్నారు. ఆ త‌రువాత కొద్ది రోజుల‌కు త‌న‌కు ఆ బ్యాచ్‌లో ఉన్న అమ్మాయితో పెళ్లి అయింద‌ని.. ఆ అమ్మాయి మాత్రం తాను సైట్ కొట్టిన అమ్మాయి కాదు అని వెల్ల‌డించారు.

Advertisement

Advertisement


త‌న భార్య ఫ్రెండ్‌కు సైట్ కొడితే.. త‌న భార్య ప‌డింద‌ని చెప్పారు. త‌న ఫ్రెండ్‌కు సైట్ కొట్టావ‌ని ఇప్ప‌టికీత‌న భార్య త‌న‌ను అంటుంద‌ని చెప్పారు. అదేవిధంగా ప్ర‌తి రోజు త‌న‌కు, త‌న భార్య‌కు ఏదో ఓ విష‌యంపై చిన్న గొడ‌వైన జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఎఫ్‌-2 సినిమాలో కొన్ని స‌న్నివేశాలు కూడా త‌న రియ‌ల్ లైఫ్ లోనివే అని వెల్ల‌డించారు. ఇక ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఎఫ్‌3 సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇవాళే విడుద‌లైనప్ప‌టికీ పాజిటివ్ టాక్ తో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ కామెడీ సీన్లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయ‌ని స‌మాచారం.

Visitors Are Also Reading