Home » పుదీనాతో ఇన్ని ప్రయోజనాలా..? జీర్ణ సమస్యలు పరార్..!

పుదీనాతో ఇన్ని ప్రయోజనాలా..? జీర్ణ సమస్యలు పరార్..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణం మనం పుదీనాని మనం ఎక్కువగా నాన్ వెజ్ వంటకాల్లో.. లేదా బిర్యానీలో,  పుదీనా పచ్చడి చేస్తుంటారు. పుదీనాతో తయారు చేసిన ఏ వంటకం అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. పుదీనాని “Spearmint or Mint Leave”  అని పిలుస్తారు. ప్రస్తుతం సలాడ్స్, డెజర్ట్స్ లో కూడా దీనిని వాడుతుంటారు. ఇంత ప్రాచుర్య పొందిన పుదీనాలో ఎన్ని పోషకాలు ఉన్నాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

 

  • పుదీనాని ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై అద్భుతమైన ఔషదంగా పని చేస్తుంది.
  • 100 గ్రాముల పుదీనా ఆకుల్లో 70 క్యాలరీలుంటాయి. సోడియం 31 మిల్లీ గ్రాములు, పొటాషియం-569 మిల్లీ గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 15 గ్రాములు, డైటరీ ఫైబర్లు-8 గ్రాములు, ప్రోటీన్లు-3.8 గ్రాములు ఉంటాయి. 
  • విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ బీ6, ఐరన్ లతో పాటు.. కాల్షియం మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్ లభిస్తాయి. 
  • కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు కావాల్సిన విటమిన్ సి పుదీనాలో పుష్కలంగా ఉంటుంది.

Advertisement

  • పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ అనే పదార్థం మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఐబీఎస్ అనే సమస్య ఉన్న వారికి కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్, అకస్మాత్తుగా విరేచనం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
  • నోటి దుర్వాసన తగ్గించడంలో పుదీనా బాగా పని చేస్తుంది. రోజు ఉదయాన్నే నాలుగు అయిదు పుదీనా ఆకులను నమలడం ద్వారా నోటీ దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. 
  • ఇందులో ఉండే కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు చుండ్రును కూడా నివారిస్తుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

LPG Cylinder : గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?

Visitors Are Also Reading