Home » జగన్ మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో గమనించారా?

జగన్ మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో గమనించారా?

by Srilakshmi Bharathi
Ad

తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పటి పాలనకు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు పోలికలు చూడడం మొదలైంది. ఇక మీడియా కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న సమాంతరాలపై కూడా ఫోకస్ చేస్తోంది. జగన్ మోహన్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా పరిపాలనకు కొత్తవారే అయినప్పటికీ తమ సామర్ధ్యాలను వేగంగానే ప్రదర్శించారు.

Advertisement

పరిపాలన సజావుగా సాగడం కోసం సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. ఇక ప్రతిపక్షాలపై ఇరువురు ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారో కూడా చూద్దాం. ఆంధ్రాలో టీడీపీ పార్టీ పట్ల జగన్ మొదటినుంచి ప్రతీకార వైఖరినే అవలంబిస్తూ వచ్చారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి రాజకీయ ప్రతీకార చర్యను చూపారు. సిబిఎన్ నివాసం పక్కన ఉన్న ప్రజావేదికను కూల్చి నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు. రాజధాని ప్రకటనతో సహా.. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలను తిరస్కరించి కొత్త పథకాలను ప్రవేశపెట్టుకుంటూ వచ్చారు. ఇక టీడీపీ నాయకులపై కేసులు పెట్టె సంగతి సరేసరి.

Advertisement

తెలంగాణకు వస్తే, కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్షిస్తానని ప్రకటించారు. కానీ, గతంలో రేవంత్ రెడ్డి పై ఓటుకు నోటు కేసు పెట్టిన విషయమై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈయనేమీ తొందరపడలేదు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే ప్రగతి భవన్ ప్రగతి భవన్ గేట్లను కూల్చేసి, భవనం పేరుని జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ అని నామకరణం చేసారు. తర్వాత ప్రజలతో దర్బార్ నిర్వహించారు. కేసీఆర్‌కు తుంటి గాయం అయ్యి సర్జరీ చేయించుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో ఆయన వద్దకు వెళ్లి పరామర్శించి, చికిత్స విషయంలో సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడం మాత్రం మెచ్చుకోదగ్గ విషయమే. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కోలుకుని హాజరు అవ్వాలని కోరుకోవడం విశేషమే. ఈ వ్యవహార శైలి ఇద్దరిమధ్య ఉన్న బేధాలను చూపిస్తోంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading