Home » ఆచార్య సినిమాని కొరటాల డైరెక్షన్ చేయలేదా.. అసలు నిజం అదేనా..?

ఆచార్య సినిమాని కొరటాల డైరెక్షన్ చేయలేదా.. అసలు నిజం అదేనా..?

Ad

ఆచార్య మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై మరియు దాన్ని డైరెక్షన్ చేసిన కొరటాల శివ పై అనేక రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. సినిమాలో కొరటాల శివ మార్క్ అస్సలు కనిపించడం లేదని అన్ని రొటీన్ సన్నివేశాలే ఉన్నాయంటూ కొరటాల శివ సినిమా ఇలా ఉండదంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మూవీ మొదటి సన్నివేశం నుంచే క్లైమాక్స్ వరకు అభిమానులకు సీరియల్ చూస్తున్న భావన కలిగిందట. సినిమా షూటింగ్ ఎక్కువ కాలం పెట్టడం వల్ల లేదంటే ఇతర కారణాల వల్లో ఈ మూవీ ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేదు అని చెప్పవచ్చు.

Advertisement

ఈ తరుణంలో ప్రేక్షకులంతా కొరటాల శివను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కథ చాలా డల్ గా ఉందని, స్క్రీన్ప్లే అస్సలు బాగా లేదని వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అభిమానులు అనడంతో కొరటాల శివ చాలా ఫీలవుతున్నారని తెలుస్తున్నది. అయితే కొరటాల కథలు మరియు స్క్రీన్ ప్లే లో మార్పులు చేయడం వల్లే సినిమాకు ఫలితం ఈ విధంగా వచ్చిందని.. అనే సందేహాలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాతగా నిరంజన్ రెడ్డి కూడా నష్టాలను ఏ విధంగా భర్తీ చేస్తారో చూడాలి.

Advertisement

ఈ మూవీని కొనుగోలు చేసిన బయ్యర్లను ఏ విధంగా ఆదుకుంటారని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో టికెట్లు రేట్లు కూడా పెరగడంతో ఆచార్య మూవీకి ఆశించిన స్థాయిలో బుకింగ్స్ కూడా రావడం లేదు. అయితే టికెట్ రేట్లు తగ్గిస్తే కొంత మెరుగైన ఫలితం ఉండవచ్చని మరికొందరు అంటున్నారు. ఆచార్య మూవీ కోల్పోవడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాల నుంచి వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ ఈ సారి చాలా మ్యాజిక్ చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఈ భిన్న ఫలితం రావడంతో చాలా ఫీలవుతున్నారు.

ALSO READ;

మంత్రి రోజాకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌న్మానం చేయాలంటున్న బండ్ల గ‌ణేష్

ఆ లాజిక్ ప్రకారం సర్కారు వారి పాట కూడా ప్లాప్..! నెటిజన్స్ వెతికి మరీ ఇచ్చిన ఆ లాజిక్ ఏంటంటే.. ?

 

Visitors Are Also Reading