Home » మంత్రి రోజాకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌న్మానం చేయాలంటున్న బండ్ల గ‌ణేష్

మంత్రి రోజాకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌న్మానం చేయాలంటున్న బండ్ల గ‌ణేష్

by Anji

ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలో భాగంగా ఆర్‌.కే.రోజాకు మంత్రి ప‌ద‌వీ వ‌రించిన విష‌యం విధిత‌మే. రోజాకు మంత్రి ప‌ద‌వీ ద‌క్క‌డంతో సినీ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ శుభాకాంక్ష‌లు చెప్పారు. ఇవాళ ఆయ‌న ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రోజా ఒక సినీ న‌టిగా ప్ర‌యాణం ప్రారంభించి.. రాజ‌కీయాల్లో పోరాడార‌ని గుర్తు చేసారు.


రెండు సార్లు ఓడిపోయి.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి ప‌దవీ రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని బండ్ల గ‌ణేష్ పేర్కొన్నారు. అయితే మంత్రి ప‌ద‌వీ చేప‌ట్టిన రోజాను తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌న్మానించాల‌న్నారు. రోజాను స‌న్మానించే విష‌యంపై సినీ పెద్ద‌లు కూర్చొని త్వ‌ర‌గా ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని పేర్కొన్నారు. రోజాను మంత్రిగా చూడ‌డం చాలా సంతోషంగా అనిపిస్తోంద‌న్నారు. ప్ర‌స్తుతం తాను రాజ‌కీయాల్లో లేను అని పేర్కొన్నారు. గ‌తంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాన‌ని.. ప్ర‌స్తుతం ఏ పార్టీలో లేన‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌పార్టీ ఓడిపోవ‌డం బాధ క‌లిగించిందన్నారు. త‌న‌కు ప్ర‌తి పార్టీలో స్నేహితులు ఉన్నార‌ని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్‌లో రంజిత్ రెడ్డి మంచి స్నేహితులు అని.. స్నేహానికి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌న్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించ‌డంపై అభిప్రాయం అడ‌గగా.. త‌న‌ను కొంద‌రి గురించి అస‌లు అడ‌గ‌వ‌ద్ద‌ని కోరారు. అందులో పవ‌న్ క‌ల్యాణ్‌, బొత్స స‌త్య‌నారాయ‌ణకు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో కరెంట్ లేదని మంత్రి బొత్స సత్యనారాయరణ ఆరోపించడంపై అభిప్రాయం అడగగా.. తనను కొందరి గురించి అడగొద్దని కోరారు. తాను పవన్ కళ్యాణ్‌కు, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తేల్చి చెప్పారు. బొత్స సత్యనారాయణ తనకు అన్న లాంటి వారని చెప్పుకొచ్చారు.

Also Read : 

ఆచార్య‌కు నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేదు…వైర‌ల్ అవుతున్న కొరాటాల కామెంట్స్..!

వివాహానికి సిద్ధమవుతున్న సాయిపల్లవి..!!

Visitors Are Also Reading