Home » ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ సన్నివేశాన్ని గమనించారా..?

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ సన్నివేశాన్ని గమనించారా..?

by Mounika
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. 1000 కోట్లకు పైగా వసూల్ చేసి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాటిచెప్పింది. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులు కలిస్తే, వారి మధ్య స్నేహం చిగురిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంపై జక్కన్న రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆర్ఆర్ఆర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి.

rrr

Advertisement

ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. ఒక అద్భుతమైన స్నేహబంధాన్ని తెరపై ఎక్కించడంలో రాజమౌళి నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ సినీ ప్రముఖుల సైతం రాజమౌళి దర్శక ప్రతిభకు జోహార్ పలికారు. దీంతో హాలీవుడ్ లో సైతం ఆర్ఆర్ఆర్ పలు అవార్డులను సొంతం చేసుకునేలా చేసింది. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని కూడా ఆర్ఆర్ఆర్ కైవసం చేసుకుంది.

Advertisement

ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఇక నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కర్ని ఉరూతలూగించింది. ఇకపోతే ఈ చిత్రంలో ఈ చిన్న విషయాన్ని చాలామంది గమనించకపోవచ్చు. అదేంటంటే.. కొమరం భీముడో పాటలోని రామ్ చరణ్ ఎన్టీఆర్ ని ముళ్ళ కొరడాతో కొడుతూ ఉంటారు. బ్రిటిష్ వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక ఎన్టీఆర్ పనిష్మెంట్ ఇచ్చే వేదికపై ఒక్కసారిగా కోప్పకూలిపోతాడు.

కొమరం భీమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అది చూసినా ఆయన చుట్టూ ఉన్న జనాలు ఇనుప ముళ్ళకంచెలను పెకలించి మరీ.. బ్రిటిష్ వారిని కొట్టడానికి వస్తారు. అక్కడ ఉన్న బ్రిటిష్ వారిని కోపంతో కొడతారు కానీ భీమ్ ని అంతలా కొట్టిన అల్లూరి సీతారామరాజుని కొట్టడానికి మాత్రం ఒక్కరు కూడా ముందుకు వెళ్లారు. జనాలు అలా చేయడానికి గల కారణం ఏంటంటే రామ్ మరియు భీమ్ స్నేహం ఎంత గొప్పదో వారందరికీ తెలుసు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

కొడాలి నాని వలన ఎన్టీఆర్, వి. వి వినాయక్ కాంబినేషన్లో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా..?

అలనాటి స్టార్ కమెడియన్ అనూజ గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

అలనాటి ఈటీవీ సీరియల్స్ హీరోయిన్స్ గుర్తున్నారా..! వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

Visitors Are Also Reading