Home » యాత్ర 2 లో డైరెక్టర్ మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా..?

యాత్ర 2 లో డైరెక్టర్ మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా..?

by Anji
Ad

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 2019లో తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కించారు దర్శకుడు మహి వి.రాఘవ్. యాత్ర 2 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో విజయం సాధించడం నుంచి 2019 ఎన్నికల్లో సీఎంగా జగన్ విజయం సాధించే వరకు జరిగిన పలు సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కొన్ని లాజిక్స్ ని మిస్ అయ్యారు డైరెక్టర్ మహి వి.రాఘవ్. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

యాత్ర 2 పూర్తి కన్వినియెంట్ వన్ సైడెడ్ బయోపిక్ అనడానికి ఇందులో చాలా రుజువులు ఉన్నాయి. జగన్ కి ప్రతికూలమైన చంద్రబాబు నాయుడు, సోనియాగాంధీ లాంటి వాళ్లను విలన్లు చూపించడంలో దర్శకుడు ఏమాత్రం మొహమాట పడలేదు. అదే సమయంలో జగన్ కి ఇబ్బంది కలిగించే వ్యక్తుల పాత్రలను ఈ సినిమాలో లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ జైలులో ఉండగా కష్టపడి పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల.  జగన్ సోదరి షర్మిల ఆనవాళ్లు కూడా లేకుండా సినిమాని తెరకెక్కించడం గమనార్హం. మరోవైపు జగన్ జైలుకు వెళ్లినప్పుడు తల్లి విజయమ్మ, భార్య భారతినే ఆయన కోసం పోరాడినట్టు.. విజయమ్మ జనాల్లో తిరిగినట్టు చూపించారు.

Advertisement

మరోవైపు పవన్ కళ్యాణ్, వైఎస్ వివేకానంద రెడ్డి పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించలేదు. కానీ ఒక్క చోట మాత్రం చంద్రబాబు పాత్రతో ఒక వైపు బీజేపీని జాతీయ పార్టీ, మరోవైపు జనసేనను  తలతోకా లేని పార్టీ అంటూ పరోక్షంగా పవన్ పై కౌంటర్ వేయించాడు. కేవలం జగన్ ను హీరోను చేసేందుకే ఈ సినిమా తీశారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లే సమయంలో రాజశేఖర్ రెడ్డి,  జగన్ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని టీవీలో చూపించినప్పుడు నిజ జీవితంలో జగన్ ఇంటి వద్దనే ఉంటాడు. కానీ బయోపిక్ లో మాత్రం జగన్ ఇడుపుల పాయకి వెళ్లినట్టు.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వీక్షించినట్టు చూపించడం గమనార్హం. ఇలా యాత్ర 2 మూవీలో చాలా సీన్లలో లాజిక్ మిస్ అయ్యారు. ప్రస్తుతం మిస్ అయిన లాజిక్స్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading