Home » భారతీయుడు మూవీ కథలో ఇది గమనించారా.. పెట్టిన బడ్జెట్ కన్నా ఇన్ని రేట్లు వసూలు చేసిందా..?

భారతీయుడు మూవీ కథలో ఇది గమనించారా.. పెట్టిన బడ్జెట్ కన్నా ఇన్ని రేట్లు వసూలు చేసిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ప్రతి డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయాలి అనుకుంటున్నారు.. దానికోసం కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. అలా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీసిన అవి సక్సెస్ అవుతాయో లేదో తెలియదు.. ప్రస్తుతం ఈ ట్రెండ్ మాత్రం ఇండస్ట్రీస్ లో నడుస్తోంది.. కానీ దాదాపు 25 సంవత్సరాల క్రితమే మనకు పాన్ ఇండియా లెవల్లో సినిమా వచ్చింది. అదేంటో మీకు ఇప్పటికే గుర్తు వచ్చి ఉంటుంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు.. అప్పట్లో ఈ మూవీ దేశమంతా ఒక ఊపు ఊపింది.. మరి అప్పుడు ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత, ఎంత వసూలు చేసిందో వివరాలేంటో తెలుసుకుందాం..

Advertisement

ALSO READ:లైగ‌ర్ క‌థ‌కు అల్లు అర్జున్ తో లింక్‌.. ఆ విష‌యాన్ని వెల్ల‌డించిన పూరిజ‌గ‌న్నాథ్‌..!

మన దేశం దశాబ్దాలుగా వెనుకబడి పోవడానికి కారణం ఏంటి అంటే అవినీతి అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. అవినీతికి ప్రారంభ మెట్టు లంచం. అయితే ఎన్నో ప్రాణాలు పోయి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధులు ఇప్పుడు ఉంటే మేము తెచ్చిన స్వాతంత్ర దేశం ఇదా అంటూ బాధపడేవారు. ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికుంటే ఈ పరిస్థితిని చూస్తే ఎలా రియాక్ట్ అయ్యేవారో, అనే ఆలోచన నుంచి వచ్చిందే భారతీయుడు సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, నటశిఖరం కమలహాసన్ కాంబినేషన్ లో దేశభక్తిని రగిలించే భారతీయుడు సినిమా బడ్జెట్, కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు చూద్దాం.. శంకర్ డైరెక్షన్ లో దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్ 15 కోట్ల బడ్జెట్ తో సినిమా వచ్చింది. అప్పట్లో 15 కోట్ల బడ్జెట్ అనగానే అందరూ షాకయ్యారు. మరి అంత షేర్ సినిమా వసూలు చేస్తుందా అనే అనుమానాలు పడ్డారు.

Advertisement

అయినా శంకర్ ఏ మాత్రం తగ్గకుండా సినిమా పూర్తి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు మొత్తాన్ని కలుపుకుంటే దాదాపు 60 కోట్లకు పైగానే ఈ సినిమా అప్పట్లో వసూలు చేసిందట. అప్పట్లో ఈ సినిమా ఒక రికార్డ్ క్రియేట్ చేసుకొని వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ రికార్డును 2005 వరకు ఏ మూవీ బ్రేక్ చేయలేదు. తర్వాత వచ్చిన చంద్రముఖి ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఈ మూవీకి అప్పట్లోనే మూడు నేషనల్ అవార్డ్స్ మరో రికార్డు గా చెప్పవచ్చు. బెస్ట్ యాక్టర్ గా కమల్ హాసన్ కు నేషనల్ అవార్డు రాగా, బెస్ట్ డైరెక్షన్ కు మరో రెండు నేషనల్ అవార్డులు వరించాయి. ఇంతటి ఘన విజయం సాధించిన భారతీయ సినిమాకి సీక్వెల్ కూడా తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ALSO READ:భోజ‌నం చేసిన త‌రువాత మ‌ధ్యాహ్నం నిద్ర‌పోతున్నారా..? అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే..!

Visitors Are Also Reading