Home » లైగ‌ర్ క‌థ‌కు అల్లు అర్జున్ తో లింక్‌.. ఆ విష‌యాన్ని వెల్ల‌డించిన పూరిజ‌గ‌న్నాథ్‌..!

లైగ‌ర్ క‌థ‌కు అల్లు అర్జున్ తో లింక్‌.. ఆ విష‌యాన్ని వెల్ల‌డించిన పూరిజ‌గ‌న్నాథ్‌..!

by Anji
Ad

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాకు ఐకాన్‌ స్టార్ అల్లుఅర్జున్ తో లింక్ ఉందని పూరి జగన్నాథ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్రెట్ ని పూరి జ‌గ‌న్నాథ్ బయటపెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సీక్రెట్ రివిల్ చేసి షాక్ ఇచ్చారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పదేళ్ల క్రితం ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఓ హాలీవుడ్ డైరెక్టర్ గురించి తనతో చెప్పారని.. ఆ డైరెక్టర్ ఏ సినిమా చేసినా కూడా హీరోకి ఏదో ఒక లోపం ఉండేలా రోల్ డిజైన్ చేస్తారు. మీరు కూడా అలా కథ రాయచ్చుగా అని అల్లు అర్జున్ చెప్పడమే ఈ లైగర్ సినిమాకు మూలమని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Jr NTR-Kodali Nani : ఈ ఫోటో ఎప్ప‌టిది..? దీని వెనుక ఉన్న క‌థ గురించి మీకు తెలుసా..?

Advertisement


ఇక ఈ సినిమాలో హీరో న‌త్తి ఉండే విధంగా క‌థ రాస్తే ఎలా ఉంటుంద‌ని నేను అడ‌గ‌గా.. చాలా బాగుంటుంద‌ని రాయ‌మ‌ని చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు పూరి జ‌గ‌న్నాథ్. ఇక ఈ ఐడియా వచ్చిందే అల్లు అర్జున్ కారణంగా అంటూ ఓపెన్ అయ్యారు ఈ డైరెక్టర్. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీక్రెట్ రివీల్ చేసి అల్లు అర్జున్ అభిమానులను కూడా తన లైగర్ సినిమా వైపు తిప్పుకున్నారు పూరి జగన్నాథ్. బన్నీ ఐడియా అని తెలిసింది కాబట్టి అల్లు అర్జున్ ఆర్మీ లైగర్ సినిమాకు ట్రెండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక పోతే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దేశాన్ని చుట్టి వచ్చారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ అన‌న్య‌పాండే. దేశంలో ఉన్న‌టువంటి అన్ని ప్రధాన నగరాల్లో లైగర్ టీమ్ ఓ ట్రెండ్ క్రియేట్ చేయడంలో కీలకపాత్ర పోషించింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి : మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే..!

ఇక లైగర్ సినిమాతో ఇండియాని షేక్ చేయబోతున్నాం అని ముందే హింట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమాను చాలా కొత్త‌గా చూపించారు. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్‌ ఎలిమెంట్స్ చూపించబోతున్నారట. ఇప్పటిదాకా టాలీవుడ్ రౌడీ స్టార్ గా పిలిపించుకుంటున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. విజయ్ అనన్య పాండే న‌ట‌న‌ యువతకు చాలా బాగా న‌చ్చుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన‌ ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రియల్ లైఫ్ బాక్సర్ అయినా ఆయన కెమెరా ముందు బాక్సింగ్ చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ- మైక్ టైసన్ మధ్య షూట్ చేసిన సీన్స్ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. సోష‌ల్ మీడియాలో మాత్రం ఎవ్వ‌రికీ తోచిన విధంగా వారు సినిమాపై కామెంట్స్ చేయ‌డం విశేషం.

ఇది కూడా చ‌ద‌వండి :  “లైగర్” సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు..? అవేనా …?

Visitors Are Also Reading