Home » ఈ యాంకర్ మీకు గుర్తు ఉందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

ఈ యాంకర్ మీకు గుర్తు ఉందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

by Sravya

చాలామంది యాంకర్లుగా ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలని పొందుతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం టాలెంట్ వున్నా అదృష్టం లేక యాంకర్ గానే మిగిలిపోతారు. లేదంటే యాంకర్ గా కూడా ఒక్కో సారి అవకాశాలని కోల్పోతూ ఉంటారు. జయంతి మీకు గుర్తుండే ఉంటుంది. యాంకరింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. చాలా మందికి జయంతి పేరు చెప్తే గుర్తుకు రాదు కానీ జెమినీ మ్యూజిక్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన వెన్నెల ప్రోగ్రాం లో యాంకర్ అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది.

ఆదిత్య టీవీ కింద జెమిని మ్యూజిక్ మారిన తర్వాత అందులో రాత్రి పది గంటలకి వెన్నెల షో వచ్చేది. దానిలో యాంకర్ గా పనిచేసేది జయంతి. తను ముద్దు మాటలతో, అందంతో, అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకునేది. వెన్నెల షో తర్వాత జయంతి ఇంకేం షో చేయలేదు. వెండితెర పైకి ఆ టైంలోనే అడుగుపెట్టింది జయంతి. 2018లో లచ్చి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

కానీ ఆ సినిమా ఏమి పెద్దగా హిట్ అవ్వలేదు. ఇంకోసారి బుల్లితెరపై కానీ వెండితెరపై కానీ కనపడలేదు. ఈ మధ్య మాత్రం ఒక టీవీ షోలో సడన్ గా కనబడింది జయంతి. తన హుషారైన స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారి జయంతి సోషల్ మీడియాలో వైరల్ గా అయింది అయితే మరి జయంతి ఆ షో కి ఎందుకు వచ్చింది..? గెస్ట్ గా వచ్చిందా లేకపోతే ఆమె మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందా అనేది తెలీదు.

Also read:

శోభన్ బాబు- జగపతి బాబు మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

ఐదే నిమిషాల్లో నీరసం పరార్… ఇలా చేస్తే చాలు..!

Asian Games : టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!

Visitors Are Also Reading