నల్ల మిరియాల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. భారతీయులు వీటిని ఎక్కువగా సుగంధ ద్రవ్యాలుగా వినియోగిస్తారు. అంతేకాదు.. ఇందులో ఆయుర్వేద గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని డైట్ లో వినియోగిస్తే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాదు.. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే తప్పకుండా నల్ల మిరియాలను వినియోగించాల్సి ఉంటుంది.
Also Read : రుద్రాక్ష మాలను ధరిస్తున్నారా…? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.
Advertisement
నల్ల మిరియాలలో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని శాస్త్రీయ నామం పైపర్ నిగ్రామ్ అని పిలుస్తారు. నల్ల మిరియాల్లో చాలా రకాల ఔషద గుణాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్-ఏ, విటమిన్ ఇ, విటమిక్ కె, విటమిన్ సి, విటమిన్ బీ6, థయామిన్, నియాసిన్, సోడియం, పొటాషియం వంటి గుణాలు లభిస్తాయి. ఆహారంలో వీటిని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పైపెరిన్ కలిగి ఉంటాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల కొవ్వును పెంచే కణాలను తగ్గిస్తుంది.
Advertisement
Also Read : వివాహితులకు ఒడిబియ్యం పోయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా ?
అంతేకాదు.. ఇందులో కేలరీలు అధిక పరిమాణంలో లభిస్తాయి. శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది. నల్ల మిరియాల్లో ఉండే పోషకాలు జలుబు-దగ్గు, వైరల్ ప్లూ వంటి సమస్యల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఎండు మిర్చిలో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నల్ల మిరియాలు అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా రక్తపోటు సమస్యలను తగ్గించడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read : Kabzaa Trailer : కబ్జా ట్రైలర్ రిలీజ్… కేజిఎఫ్ మూవీని మించిపోయిందిగా…!