Home » యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి ఆర్థిక క‌ష్టాల గురించి మీకు తెలుసా..?

యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి ఆర్థిక క‌ష్టాల గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి గురించి తెలియ‌ని వారెవ్వ‌రు ఉండ‌రు. ఎందుకంటే ఆమె త‌న‌కంటూ ఓ బ్రాండ్ సంపాదించుకుంది. ముఖ్యంగా టీవీ9 ద్వారా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవ‌ల హీరో విశ్వ‌క్ సేన్‌, యాంక‌ర్ దేవీ మ‌ధ్య ఓ ఇష్యూ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ఇష్యూ తెగ వైర‌ల్ అవుతోంది.


ముఖ్యంగా దేవీ నాగ‌వ‌ల్లి ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కున్నారు. ఆ త‌రువాత బాధ్య‌త గ‌ల జ‌ర్న‌లిస్ట్‌గా ఉన్నారు. దేవీ బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ స‌మ‌యంలో త‌న గురించి ఆమె పలు విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా రాజమండ్రిలోనే పుట్టి, పెరిగినట్టు చెప్పింది. ఆమె పేరు నాగ‌వ‌ల్లి అని.. బీకామ్ వ‌ర‌కు చ‌దువుకుని ఆమె గ్రాఫిక్స్ నేర్చుకుని గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ఓఛాన‌ల్‌లో జాయిన్ అయింది. అక్క‌డ గ్రాఫిక్ డిజైన‌ర్‌గా వెళ్లిన త‌న‌కు యాంక‌ర్‌గా చేయాల‌ని ఆఫ‌ర్ వ‌చ్చింది. వెంట‌నే ప్ర‌య‌త్నం చేసి.. గ్రాఫిక్స్ డిజైన‌ర్ నుంచి యాంక‌ర్‌గా మారింది.

Advertisement

Advertisement


త‌నకు ఉరుకుల ప‌రుగుల జీవితం అంటే చాలా ఇష్టం అని.. నేచ‌ర్ డిజాస్ట‌ర్, బ్లాంబు బ్లాస్ట్ వంటివి క‌వ‌ర్ చేయ‌డం అంటే చాలా ఆస‌క్తి అని బిగ్‌బాస్‌-4లో చెప్పింది దేవి. ఇక పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి జ‌రిగిందని.. పెళ్లి జ‌రిగిన త‌రువాత యూఎస్ఏ వెళ్లింద‌ని వెల్ల‌డించింది. అక్క‌డ 8 నెల‌ల‌కు మించి ఉండ‌లేక‌పోయిన‌ట్టు వివ‌రించింది. అదేవిధంగా విడాకులు కూడా తీసుకున్న‌ట్టు చెప్పింది. ప్ర‌స్తుతం దేవీకి ఓ బాబు ఉన్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా వార్త‌లు చ‌దివేట‌ప్పుడు వాళ్ల ద‌గ్గ‌ర అంత డ‌బ్బు ఉంది. ఇంత డ‌బ్బు ఎలా సంపాదించారనిపించేది. చాలా వ‌ర‌కు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కున్నాను. వ‌చ్చిన జీతం వ‌చ్చిన‌ట్టు అయిపోయేది. ఇన్ని క‌ష్టాల మ‌ధ్య డ‌బ్బు కోస‌మే బిగ్‌బాస్‌లోకి వ‌చ్చాను అని దేవి తెలిపింది.

ఇక తాజాగా నెల‌కొన్న వివాదంతో అప్పుడు దేవి త‌న గురించి చెప్పిన విష‌యాల‌న్నీ ఇప్పుడు మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం విశేషం. ఏది ఏమైనా జీవితంలో ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా ప‌ట్టిన ప‌ట్ట వ‌ద‌ల‌కుండా ఓ మ‌హిళ త‌న ప్ర‌స్తానాన్ని కొన‌సాగిస్తూ.. స‌మాజంలో జ‌రుగుతున్న ఎన్నో త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తూ.. ఒప్పుల‌ను ప్ర‌శంసిస్తూ.. ముందుకు సాగుతున్న‌ దేవీ నాగ‌వ‌ల్లి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

Also Read : 

ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ఫోటో గ్యాలరీ ..!

మాన‌వ‌త్వం చాటిన పోలీసులు.. మోటార్ సైకిల్ కొనుగోలు..!

Visitors Are Also Reading