Telugu News » శ్రీ‌హ‌రికి త‌న మ‌ర‌ణం గురించి మూడు నెల‌ల ముందే తెలుసా..?

శ్రీ‌హ‌రికి త‌న మ‌ర‌ణం గురించి మూడు నెల‌ల ముందే తెలుసా..?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీహరి మంచి నటుడిగా మంచి మనిషిగా పాపులారిటీ సంపాదించుకున్నారు. శ్రీహరి నటన మహా అద్భుతం అనే చెప్పాలి. ఓ వైపు హీరోగా మరోవైపు విలన్ గా ఏ పాత్ర చేసినా నటనలో విలీనమై పోయేవారు. కొన్నేళ్ళ క్రితం శ్రీహరి కాలేయ వ్యాధితో మృతి చెందిన విషయం తెలిసిందే.

Ads

శ్రీహరి మరణ వార్త ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఇంటర్వ్యూలో శ్రీహరి మరణానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకోసం అనారోగ్యం గా ఉందని.. ఎక్కువ కాలం బ్రతకను అని శ్రీహరికి ముందే తెలుసని చెప్పారు.

శ్రీహరి నెమ్మదిగా తాను నటించే సినిమాల సంఖ్య త‌గ్గించుకున్నార‌ని జ‌ర్న‌లిస్ట్ భరద్వాజ్ తెలిపారు. తెలుగులో సత్యమేవ జయతే లాంటి షో శ్రీ‌హ‌రితో చేయాల‌ని అనుకున్నార‌ని అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి ఆయన ఆ షోకి నో చెప్పారని వెల్లడించారు. ప‌లు కార‌ణాల వల్ల ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని చెప్పారు. సినిమా రంగంలో చాలా వెరైటీగా శ్రీహరి కెరీర్ ప్రారంభం అయిందని తెలిపారు.


ముఖ్యంగా వంగవీటి రంగా ప్రోత్సాహం వల్లనే శ్రీహరి సినిమాలలోకి వచ్చారని దాసరి ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. శ్రీహరికి డైరెక్టర్లు అంద‌రూ అవకాశం ఇచ్చారని.. నటనతో అవ‌కాశం ఇచ్చిన అందరినీ మెప్పించారు. ఈవీవీ సత్యనారాయణ శ్రీహరికి మంచి రోల్స్ ఇచ్చారని తెలిపారు. ఏ పాత్ర ఇచ్చిన శ్రీహరి చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు అని వివరించారు. మోహ‌న్‌బాబు తర్వాత శ్రీ హరి అనే పేరు వచ్చిందని ఆయన వెల్లడించారు. మగధీర సినిమాలో శ్రీ‌హ‌రి న‌టించిన షేర్ ఖాన్ పాత్ర మంచి పేరు తెచ్చి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. భరద్వాజ్ వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి.

Also Read : 

బాల‌య్య బాబు అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాకి కూడా లాభాలు వ‌చ్చాయ‌ట‌..!

Dasari…. చిరు, బాల‌య్య‌, నాగార్జున‌ల‌కు ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటి? 1992 నాటి ముచ్చ‌ట‌!


You may also like