Home » ‘బేబి’ వంటి గోల్డెన్ ఛాన్స్ ని ఈ యంగ్ హీరో మిస్ చేసుకున్నాడా ?

‘బేబి’ వంటి గోల్డెన్ ఛాన్స్ ని ఈ యంగ్ హీరో మిస్ చేసుకున్నాడా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబి మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.60కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. వీక్ డేస్ అయినా.. వర్షాలు వస్తున్నా కానీ బాక్సాఫీస్ జోరుకు బ్రేకులు పడటం లేదు. చిన్న సినిమాల్లో ఇలాంటి విజయాలను అందుకునే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇంతటి సంచలనం సృష్టించిన సినిమాకి సంబంధించి కనీసం కథ కూడా వినకుండానే యంగ్ హీరో విశ్వక్ సేన్ రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. 

Advertisement

 

బేబి మూవీకి సాయిరాజేష్ దర్శకుడు.. సంపూర్ణేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ.. ‘హృదయకాలేయం’ అనే మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఆ తరువాత కొబ్బరిమట్ట, కలర్ ఫొటో వంటి సినిమాలకు రచయిత, నిర్మాతగా వ్యవహరించాడు. హృదయకాలేయం సినిమా తీసిన దర్శకుడు బేబి మూవీ తీశాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బేబి మూవీ తీయాలనుకున్నప్పుడు కేవలం నిర్మాతలు తప్ప ఎవ్వరూ కూడా పెద్దగా నమ్మలేదట. ఇక ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సాయిరాజేష్ బేబి సక్సెస్ మీట్ స్టేజ్ పై వెల్లడించాడు. ఈ సినిమా కథ చెప్పడానికి ఓ హీరోని కలవడానికి ప్రయత్నిస్తే.. కనీసం కథ కూడా వినకుండానే.. అతనితో అయితే సినిమా చేయను అని ఆ హీరో  రిజెక్ట్ చేశాడని సాయి రాజేష్ తెలిపాడు. ఇక ఆ హీరో ఎవ్వరో కాదు.. యంగ్ హీరో విశ్వక్ సేన్ అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

విశ్వక్ సేన్ సైతం.. ట్విట్టర్ లో సాయిరాజేష్ ని టార్గెట్ చేస్తూ.. “ నో అంటే నోనే.. అది మగాడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేసి కూల్ గా ఉందాం. మనమంతా ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాం. మనశ్శాంతి విశ్రాంతి తీసుకోండి”  అంటూ ట్వీట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. మరోవైపు బేబి సినిమాని వదులుకొని విశ్వక్ సేన్ తప్పు చేశాడా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి క్రేజ్ మాత్రం ఉంది. కానీ అతనికి బేబి మూవీలాంటి రేంజ్ విజయం అయితే దక్కలేదు. 60-70 కోట్ల సినిమా పడుంటే.. తన ఇమేజ్ ఒక్కసారిగా మరింత పెరిగిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వక్ సేన్ ఇమేజ్ కి బేబి సినిమా సరిపోదనే వాళ్లు కొందరూ ఉండగా.. ఇతని ఇమేజ్ తోడు అయితే సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లు రాబట్టేదేమో అనేవాళ్లు మరికొందరూ ఉన్నారు. మొత్తానికి బేబి వంటి సూపర్ హిట్ మూవీని విశ్వక్ సేన్ మిస్ చేసుకున్నాడనే వార్త ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 5 హీరోలు వీళ్ళే..!

రష్మీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. రాత్రికి వస్తావా అంటూ..!

 

Visitors Are Also Reading