Telugu News » ANR కోసం SR.ఎన్టీఆర్ అంతటి త్యాగం చేశారా..ఏం వదులుకున్నారో తెలిస్తే..!!

ANR కోసం SR.ఎన్టీఆర్ అంతటి త్యాగం చేశారా..ఏం వదులుకున్నారో తెలిస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందంటే దానిలో ఈ ఇద్దరు దివంగత హీరోల పాత్ర ఎంతో ఉంది. వీరిద్దరు ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ వారు కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య సినిమాల విషయంలో చాలా పోటీ ఉండేది. ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ ఇండస్ట్రీలో ముందుగా వచ్చారు. అయినా ఇద్దరు కలిసి ఒకే విధమైన స్టార్డం పొందారు. ఇద్దరి మధ్య సినిమాల పరంగా కాస్త వైరం ఏర్పడినా కానీ మళ్ళీ కలిసి పోయేవారు. అలాంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ కోసం ఒక త్యాగం చేశారంట.. అదేంటో చూద్దాం..

Advertisement

ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి దాదాపు చాలా సినిమాల్లో నటించారు. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వంలో చాణక్యచంద్రగుప్త చిత్రంలో నటించారు. ఈ సినిమా విజయవంతమైంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ ఎప్పటినుంచో చాణక్య పాత్రలో నటించాలని కోరిక ఉండేదట, దీనికోసం కథ కూడా రెడీ చేయించుకొని ఉన్నారట. ఇది మల్టీ స్టార్స్ మూవీ అవడంతో చాణక్య పాత్ర అక్కినేని చేయాలని భావించారట.

Advertisement

అయితే అప్పటికే ఎన్టీఆర్ కు, ఏఎన్ఆర్ కు మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా కోసం ఇద్దరు కలిసి వచ్చారు. ఈ తరుణంలో చాణక్యపాత్రను ఏఎన్నార్ అడిగారు. ఎన్టీఆర్ అడ్డు చెబితే సినిమా ఆగిపోతుంది. కాబట్టి ఎలాంటి అడ్డు చెప్పకుండా తనకి ఇష్టమైన పాత్రను కూడా వదులుకొని ఏఎన్ఆర్ కి అప్పగించారు. రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేశారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading