కొన్ని సందర్భాల్లో మనం చెప్పినవి తూచా తప్పకుండా వాస్తవం అవుతుంటాయి. అలా చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పినవి నిజమవుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ రచయితగా మంచి పేరు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు వాస్తవం అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరగడం అందరికీ ఇది ఆశ్చర్యకరమనిపిస్తుంది.
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్.. తన కుమారుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతీ సినిమాకు కథను ఆయనే అందిస్తుంటాడు. అందుకే రాజమౌళి దర్శకత్వం వహించే ప్రతీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే గతంలో విజయేంద్ర ప్రసాద్ అలీతో సరదాగా షోకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగా.. అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సమాధానం హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం అయితే మీరు ఎలాంటి కథ రాసుకుంటారు ? అని అలీ ప్రశ్నించగా.. విజయేంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ.. “ఆయన కోసం సపరేట్ కథ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలో పలు సీన్స్ ని పాటలను క్రాప్ చేసి ఓ సినిమాగా తెరకెక్కించొచ్చు. కచ్చితంగా ఆయనను చూడటానికి జనాలు థియేటర్స్ కి వస్తారు. ఆ సినిమా హిట్ అవుతుంది” చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన బ్రో మూవీలో కూడా సేమ్ టూ సేమ్ అలాగే చేశారు. పవన్ కళ్యాణ్ తో ఒక ఫైట్ లేదు. ఒక రొమాంటిక్ సీన్ లేదు. ఒకనాటి డైలాగ్ కూడా లేదు. కానీ గతంలో నటించిన సినిమాలకు సంబంధించిన పాటలతో సముద్ర ఖని ఈ మూవీని హిట్ చేశారు. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “డైనమైట్ ని పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలు” అంటూ విజయేంద్ర ప్రసాద్ చాలా పవర్ పుల్ ఆన్సర్ ఇచ్చాడు. సరిగ్గా బ్రో మూవీ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !