భారత జట్టు తరపున తెలుగు గడ్డ నుంచి సీకే నాయుడు నుంచి మహ్మద్ సిరాజ్ వరకు చాలా మంది క్రికెటర్లు భారత జట్టుకు ఆడారు. బ్యాటర్లుగా, బౌలర్లుగా రాణించడమే కాదు.. కెప్టెన్లుగా కూడా భారతజట్టును ముందుండి నడిపించారు. తెలుగు ప్రజలు గర్వించదగిన క్రికెటర్లలో అంబటి రాయుడు ఒకడు. బ్యాటర్ గా జాతీయ జట్టుకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో చాలా సార్లు కీలక ఇన్నింగ్స్ ఆడి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుపున బ్యాటర్ గా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. అంతకు ఎక్కువ పేరు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి ఆడి సంపాదించాడు. సీఎస్ కే జట్టు ఈ ఏడాది టైటిల్ గెలవడంలో తనదైన పాత్ర పోషించాడు.
Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా సేవలను గుర్తిస్తూ కప్ తీసుకునే సమయంలో తనకు బదులు అతడిని పంపాడు ధోని. ఐపీఎల్ 2023తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు అకస్మాత్తుగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. ఏపీ సీఎం జగన్ ని కలిసి అందరికీ షాక్ ఇచ్చాడు. వైసీపీలో రాయుడి చేరడం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచన రాగానే నేరుగా వైసీపీలోకి వెళ్లడం.. విపక్ష పార్టీ టీడీపీ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై పలు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Advertisement
తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో ఎంఎస్కే ప్రసాద్ కి సత్సంబంధాలు కలిగి ఉన్నారనే టాక్ ఉంది. 2016 నుంచి 2020 వరకు దాదాపు నాలుగేళ్లు భారత జట్టు చీఫ్ సెలెక్టర్ గా ఉన్నారు. ఆ సమయంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం..కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుతో పాటు వెంకయ్య నాయుడు మద్దతు పుష్కలంగా ఉండటంతోనే ఎంఎస్కే కి చీఫ్ సెలెక్టర్ పదవీ వరించిందనే వార్తలు వినిపించాయి. స్టార్ ప్లేయర్ గా రాణించకపోయినా.. కేవలం పొలిటికల్ సపోర్టుతోనే బీసీసీఐలో చక్రం తిప్పారు ఎంఎస్కే ప్రసాద్. ఆయన చీఫ్ సెలెక్టర్ గా ఉన్న సమయంలోనే వన్డే ప్రపంచ కప్ 2019 జరిగింది. ఈ టోర్నీ ముందు వరకు అద్భుతంగా ఆడిన రాయుడిని ప్రపంచ కప్ టీమ్ లోకి తీసుకోలేదు. తన కెరీర్ ని ఎంఎస్కే ప్రసాద్ నాశనం చేశాడనే కోపం రాయుడిలో ఉన్నట్టు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. తన కెరీర్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేకపోయినా.. టీడీపీకి ఆ పార్టీ అధినేతకు ఎంఎస్కే ప్రసాద్ దగ్గర ఉంటాడనే కారణంతోనే రాయుడు వైసీపీలో జాయిన్ అయ్యాడనే వాదన వినిపిస్తోంది.టీడీపీపై వ్యతిరేకతతోనే నేరుగా వైసీపీతో అతను టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ?
కోహ్లీకి ఉన్న ఆ డిజార్డర్ గురించి తెలుసా? అసలు విషయం బయటపెట్టిన MSK ప్రసాద్!