Home » టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ?

టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ?

by Bunty
Ad

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘోరజయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 209 పరుగుల తేడాతో… ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది టీమిండియా జట్టు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు ఘోరంగా విఫలం కావడంతో… డబ్ల్యూటీసీలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది టీమిండియా.

Advertisement

ముఖ్యంగా రోహిత్ శర్మ… తన కెప్టెన్సీ లో అలాగే బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ కారణంగానే…. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిందని… క్రీడా విశ్లేషకులు, సీనియర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే రోహిత్ శర్మాను టీమిండియా కెప్టెన్సీ నుంచి తీసివేయాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ స్థానంలో అజింక్య రహానే లేదా మరో స్టార్ ప్లేయర్ ను టీమిండియా జట్టు కెప్టెన్ గా ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో మొన్నటి వరకు అజింక్య రహానే ను టీమిండియా జట్టు కెప్టెన్ గా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అతని ఏజ్ కూడా బార్ కావడంతో బిసిసిఐ అతని వైపు మొగ్గు చూపడం లేదట. రోహిత్ శర్మాను పక్కకు జరిపి… టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ చేయాలని బీసీసీఐ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Advertisement

శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అలాగే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఈ తరుణంలోనే టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అయితే చాలా బాగుంటుందని సెలెక్టర్లు భావిస్తున్నారట. ప్రస్తుతం గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్.. బెంగళూరులోని క్రికెట్ అసోసియేషన్ లో చికిత్స పొందుతున్నాడు. మరో నెల రోజుల్లో శ్రేయస్ అయ్యర్ రికవరీ అవుతాడు. ఆ లోపు బీసీసీఐ పెద్దలు… టీమిండియా కెప్టెన్సీ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది.

 

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్ గా అజింక్య రహానే !

షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా ! 

ఇండియా వర్సెస్ పాక్ మధ్య 3 మ్యాచ్ లు.. ఎప్పుడంటే ?

Visitors Are Also Reading