Home » రతిక కి ఆ కారణం వల్లనే రాహుల్ సిప్లిగంజ్ తో బ్రేకప్ అయిందా ?

రతిక కి ఆ కారణం వల్లనే రాహుల్ సిప్లిగంజ్ తో బ్రేకప్ అయిందా ?

by Anji
Ad

బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లోకి వచ్చిన వారిలో రతిక ఒకరు. ఈమె హౌస్ లో చాలా చలాకిగా కనిపిస్తున్నప్పటికీ తన గుండెల్లో చాలా బాధను మోస్తోందని నిన్నటి ఎపిసోడ్ చూస్తేనే స్పష్టంగా అర్థమైంది. సీజన్ ప్రారంభమైన రోజు తన బ్రేకప్ గురించి ఆరా తీశాడు నాగార్జున. హార్ట్ బ్ేక్ నుంచి బయటికి వచ్చావా అని అడిగితే హా అంటూ నవ్వుతూ చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగుతున్నారో అని నాగార్జునే నిలదీసింది. మధ్యలో నేనేం చేశానని నాగ్ అంటే.. మొత్తం మీరే చేశారు. ఇప్పుడు ఏం తెలియనట్టు అడుగుతున్నారా అని ప్రశ్నించింది రతిక. 

Advertisement

నేనేం చేశానో చెప్పు.. అని అడిగితే మాత్రం హౌస్ లోకి వెళ్లాక తెలుస్తుందని మాట దాటవేసింది రతిక రోస్. నీ హార్ట్ బ్రేక్ చేసిన వాడిని ఇమిటేట్ చేయు అని అడిగితే. ఇప్పుడు పాట పాడాలా ? అంది. అంటే తన మనస్సు ముక్కలు చేసిన వ్యక్తి సింగర్ అని అర్థం అయింది. నిన్నటి ప్రోమో ఎపిసోడ్ తో ఆ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని తేలిపోయింది. పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నుమూయు వేళా.. అనే పాటను ప్రోమోలో వదిలి హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. అప్పట్లో పునర్నవి భూపాలం కోసం ఈ పాట పాడాడు రాహుల్. రతిక కోసం మరోసారి ఈ పాట ప్లే చేసినట్టు తెలుస్తోంది. ఎపిసోడ్ లో ఈ సాంగ్ వేయలేదు.

Advertisement

రాహుల్-రతిక రిలేషన్ వాస్తవమేనంటూ.. సోషల్ మీడియాలో బోలెడన్నీ ఫొటోలు దర్శనం ఇచ్చాయి. రాహుల్ గతంలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. హే పిల్ల ఆల్బమ్ షూటింగ్ సమయంలో రాహుల్, రతికల మధ్య పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. రాహుల్ బిగ్ బాస్ లోకి వెళ్లిన తరువాత పునర్నవితో ప్రేమలో పడటంతో వీర మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చివరికీ వీరి బంధం బ్రేకప్ తో ముగిసిందట.బిగ్ బాస్ మూడో సీజన్ లో రాహుల్ పునర్నవిల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు చెప్పింది నాగార్జుననే. పదే పదే వీరి మధ్య ఏదో ఉందన్నట్టుగా కామెంట్స్ చేశాడు. ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ లో చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా అడుగుతున్నారా అని ముఖం మీదే అనేసింది రతిక. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రతిక బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

కెరీర్ లో ఫస్ట్ టైం అనుష్క విలన్ గా నటిస్తోందని తెలుసా? ఏ సినిమాలో అంటే?

Visitors Are Also Reading