టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బెస్ట్ కపుల్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రాంచరణ్-ఉపాసన దంపతులు ఒకరు.
Advertisement
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉపాసన సక్సెస్ సాధించారు. ఈ దంపతులు పదేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే వీరు తల్లిదండ్రులుగా మారబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే.
Also Read : నాగచైతన్య-శోభిత గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన సమంత..!
ఈ నేపథ్యంలోనే బుల్లి మెగా వారసుడు ఎప్పుడు రాబోతున్నాడా అని అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా పెళ్లి తరువాత తొలుత తన గురించి వచ్చినటువంటి విమర్శల గురించి వివరించారు. “ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తాను చరణ్ ఇద్దరం కలిశామని, ఇలా ఏర్పడిన మా స్నేహం ప్రేమగా మారింది. మా రెండు కుటుంబాలు విభిన్న నేపథ్యంలో కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో మా కుటుంబాలు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నాయని ఉపాసన తెలిపారు.
Advertisement
Also Read : టాలీవుడ్ మరో విషాదం..సీనియర్ నటుడు ‘కాస్ట్యూమ్ కృష్ణ’ కన్నుమూత
చిన్నప్పటి నుంచి తనను ఏదో ఒఖ విషయంలో ఇతరులు జడ్జీ చేసే వారు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కుంటూనే ఉంటారని చెప్పుకొచ్చారు ఉపాసన. పెళ్లి జరిగిన కొత్తలో చాలా మంది బాడీ షేమింగ్ అని ట్రోల్స్ చేశారని, చాలా లావుగా ఉన్నానని, అందంగా లేనని ట్రోల్స్ చేశారని చెప్పారు. మరికొందరూ కేవలం రాంచరణ్ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు అని తనపై విమర్శలు కూడా చేశారని తెలిపారు ఉపాసన. ఈ మాటలు విని కృంగిపోలేదని, ధైర్యంతో ముందుకు నడిచాను. అప్పుడు తనను విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు” అని ఉపాసన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉపాసన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ ఎంట్రీ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!