Home » వరుణ్ తేజ్ కంటే ముందే లావణ్య త్రిపాఠి మరో అబ్బాయిని ప్రేమించిందా..? అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

వరుణ్ తేజ్ కంటే ముందే లావణ్య త్రిపాఠి మరో అబ్బాయిని ప్రేమించిందా..? అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

by Anji
Ad

మెగా హీరో వరుణ్ తేజ్,  హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొద్దిరోజుల్లోనే భార్యభర్తలుగా కాబోతున్నారనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ బ్యాచ్ లో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో జూన్ 09న నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 01న ఇటలీలో వీరి పెళ్లి అత్యంత అంగరంగవైభవంగా జరుగనుంది.  ఈ నేపథ్యంలోనే కొందరూ ఆకతాయిలు సోషల్ మీడియాలో లావణ్యకి సంబంధించి  ఓ వార్తను  ట్రోల్స్ చేస్తున్నారు. 

Advertisement

 లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ కంటే ముందే ఓ హీరోని ప్రేమించిందని.. ఆ హీరోని డబ్బు కారణంగానే వదిలేసిందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆ హీరో మరెవ్వరో కాదు నవీన్ చంద్ర.. అందాల రాక్షసి సినిమా ద్వారా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక చిత్రంలో వీరి కెమెస్ట్రి చాలా బాగా వర్కౌట్ అయింది. దీంతో వీరి మధ్య ప్రేమాయణం కొనసాగిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అందుకు తగినట్టే వరుణ్-నవీన్ కూడా బిహేవ్ చేయడంతో వీరి మధ్య ప్రేమ కన్ఫామ్ అని త్వరలోనే పెళ్లి అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు. 

Advertisement

ఏమైందో ఏమో తెలియదు కానీ.. లావణ్య హీరో నవీన్ చంద్రని వదిలేసి వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. వరుణ్ తేజ్ తో లావణ్య క్లోజ్ గా దిగిన ఫొటోలు వైరలయ్యాయి. దీంతో డబ్బు కోసమే వరుణ్ తేజ్ ని ప్రేమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నవీన్ చంద్రను డబ్బు కోసమే వదిలేసిందని కొందరూ ఆకతాయిలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది రోజుల్లోనే పెళ్లి ఉండగా.. ఇలాంటి రూమర్స్ లావణ్య పై రావడం మెగా అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుందనే చెప్పవచ్చు. మరికొందరూ పెళ్లి ముందు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి..? అని ప్రశ్నించడం గమనార్హం. 

 మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి. 

Visitors Are Also Reading