Home » శుభలేఖ మూవీ ఫంక్షన్ లో కమల్ హాసన్ చిరంజీవి గురించి అలా మాట్లాడారా..?

శుభలేఖ మూవీ ఫంక్షన్ లో కమల్ హాసన్ చిరంజీవి గురించి అలా మాట్లాడారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అప్పట్లో చిరంజీవితో సినిమా తీస్తే చాలు పెట్టిన పెట్టుబడికి డోకా లేదు అని అనుకునే రోజులవి. ఆ సందర్భంలోనే విశ్వనాధ్ చిరంజీవి కాంబోలో మొదటిసారి శుభలేఖ చిత్రం తెరకెక్కింది. వివి శాస్త్రి తో కలిసి అల్లు అరవింద్ శుభలేఖ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సుమలత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా పరిచయమైన సుధాకర్ ఈ మూవీ పేరు ఇంటి పేరుగా మార్చుకున్నారు. సత్యనారాయణ మరియు రమణమూర్తి, రాళ్లపల్లి తులసి, నిర్మలమ్మ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.

Advertisement

ALSO READ;హీరోయిన్స్ విష‌యంలో అక్కినేనికి, ఎన్టీఆర్ కి ఎంత తేడా ఉంటుందో తెలుసా..?

Advertisement

శుభలేఖ మూవీ ద్వారా ఉత్తమ కథకుడిగా కె.విశ్వనాథ్ నంది అవార్డును కూడా అందుకున్నారు. అలాగే చిరంజీవి ఉత్తమ నటుడి గా తన తొలి ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. 1982 జూన్ 11న శుభలేఖ చిత్రం రిలీజ్ అయింది. అంతకు ముందు రెండు నెలల క్రితమే చిరంజీవి చేసిన మరో మూవీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య థియేటర్ లోకి వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది.. ఆ క్రమంలోనే శుభలేఖ మూవీ కూడా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

దీంతో సెప్టెంబర్ 11వ తేదీన హైదరాబాద్ సంధ్య థియేటర్లో వందరోజుల పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలహాసన్ హాజరయ్యారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని, చిరంజీవి ఇలాగే ఎన్నో విజయాలు సాధించాలని కమలహాసన్ అన్నారు. ఈ విధంగా మూవీ 100 రోజుల వేడుక సక్సెస్ ఫుల్ గా నిర్వహించుకున్నారు.

ALSO READ;

Visitors Are Also Reading