Home » అడవి శేష్ ను బాలయ్య అంతలా కొట్టించారా.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

అడవి శేష్ ను బాలయ్య అంతలా కొట్టించారా.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోలలో అడివి శేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసహిట్లతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడిప్పుడే కెరియర్ గాడిలో పడుతున్న సందర్భంలో ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. అలాంటి అడివి శేష్ ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.. అవేంటో చూద్దామా.. అడివి శేష్ ఓసారి బాలకృష్ణ వల్ల విపరీతంగా తన్నులు తిన్నాడట. అది కూడా చిన్న వయసులోనే.

Advertisement

తనకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వైజాగ్ లో ఉండేవారట. ఒక రోజు స్కూల్ నుంచి వచ్చే టైంలో ఒక కాలేజ్ దగ్గర ఒక పాట వినిపించింది. ఆ పాట బాగా నచ్చి అలాగే పాడుకుంటూ ఇంటికి వచ్చానని , ఇంట్లో కూడా ఆ పాట పాడుతుంటే అమ్మ కోపానికి వచ్చి పళ్లెంతో తల మీద గట్టిగా కొట్టింది. ఇప్పటికీ ఆ గుర్తు ఉందని అన్నారు. ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే “టాప్ హీరో”లో బీడీలు తాగండి బాబులు.. తాగి స్వర్గాన్ని తాకండి బాబులు.. ఆ తర్వాత మరో రోజు అదే చిత్రంలోని ఓ ముద్దు పాప హే ముద్దు పాప..

Advertisement

అనే పాట పాడడంతో తన తల్లి ఉతికి ఆరేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ పాటలన్నీ బాలయ్య సినిమా నుంచి వచ్చినవే. కాబట్టి బాలయ్య వల్ల అడివి శేష్ తన తల్లి చేతిలో దెబ్బలు తిన్నారట. ప్రస్తుతం ఈ యంగ్ హీరో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఇక హిట్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

Visitors Are Also Reading