Home » “బండి”తో కష్టమే.. 5 పాయింట్లు హైకమాండ్ ముందు పెట్టిన ఈటల..!!

“బండి”తో కష్టమే.. 5 పాయింట్లు హైకమాండ్ ముందు పెట్టిన ఈటల..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గరికి వస్తోంది.. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఇలా అనేక పార్టీలు రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా బలపడాలని ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఈసారి 17 నుంచి 105 సీట్లు వస్తాయని బలంగా చెబుతోంది. ఇక కాంగ్రెస్ కచ్చితంగా కర్ణాటక ఫలితాలు తెలంగాణలో ఉంటాయని, చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలియజేస్తోంది.

Advertisement

చాలా రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో గెలిస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తారు క్లారిటీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ తరంలో బిజెపి విషయానికి వస్తే బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు, చేరికల కమిటీకి ఈటల రాజేందర్ బాసుగా ఉన్నారు. కానీ ఈయన సమక్షంలో ఎవరూ కూడా బిజెపిలో ముందుకు రావడం లేదట. దీనికి ప్రధాన కారణం సంజయ్ వ్యవహరిస్తున్న విధివిధానాల అంటూ ఈటెల రాజేందర్ హై కమ్యాండ్ కు వివరించినట్లు తెలుస్తోంది.. అమిత్ షాతో భేటీ అయిన ఆయన ఐదు ప్రధాన అంశాలను ఆయన ముందు ఉంచాలని తెలుస్తోంది.. ఇంతకీ అంశాలు ఏంటయ్యా అంటే..

1. పాత కొత్త నేతల మధ్య సమన్యాయం చేసి ముందుకు సాగాలి..

2. ఇక బండి సంజయ్ ఎలాంటి ప్రసంగాలు చేసిన ఏ మీటింగ్ లో మాట్లాడిన కేవలం హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, అది తెలంగాణలో పని చేయదని అన్నారు.

Advertisement

3. హిందుత్వం గురించి మాట్లాడడం వల్లే బిజెపిలోకి ఎవరు రావడంలేదని తెలియజేసారట. అందుకే కర్ణాటకలో హిందుత్వం పనిచేయలేదని అన్నారట.

4. అంతేకాకుండా బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తీసేసి మరో నాయకుడికి అప్పగించాలని అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారట.

5. బిజెపి వల్లే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, చాలామంది అసమ్మతి నేతలు కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టు ఆయన నివేదికలో ఉంచినట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని ఇక్కడ హిందుత్వం అనే మాట పనిచేయదని, మిగతా రాష్ట్రాల లాగా తెలంగాణ ప్రజలు ఉండాలని వెంటనే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తూ ఈటెల బిజెపికి నివేదిక అందించినట్లు సమాచారం.

మరి కొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading