Telugu News » Blog » విక్ర‌మ్ త‌న‌యుడు మామూలోడు కాదు..ఒక్క సినిమాకే హీరోయిన్ తో డేటింగ్..!

విక్ర‌మ్ త‌న‌యుడు మామూలోడు కాదు..ఒక్క సినిమాకే హీరోయిన్ తో డేటింగ్..!

by AJAY
Ads

సినిమా హీరోలు అన్న త‌ర‌వాత హీరోయిన్ల‌తో డేటింగ్ చేయ‌డం స‌హ‌జం. కానీ మొద‌టి సినిమాతోనే ఓ హీరో త‌న‌యుడు హీరోయిన్ తో డేటింగ్ మొద‌లు పెట్టాడు. ఆ హీరోత‌న‌యుడు ఎవ‌రు..? ఆ హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది ఇప్పుడు చూద్దాం…. తమిళ స్టార్ హీరో విక్రమ్ కు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక పలువురు స్టార్ హీరోల తనయులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్టుగానే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కూడా తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌తో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

dhruv vikram dating with adithya varma heroine

dhruv vikram dating with adithya varma heroine

ఈ సినిమాలో హీరోయిన్ గా బనిత సంధు నటించింది. అయితే వచ్చి రాగానే విక్ర‌మ్ ధృవ్ త‌న‌ మొదటి సినిమా హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆ వార్తలకు బలం చేకూరేలా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అంతేకాకుండా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కూడా తమిళ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక రీసెంట్ గా కూడా న్యూ ఇయర్ వేడ‌కల కోసం ధృవ్ విక్రమ్ బనిత‌ తో కలిసి దుబాయ్ వెళ్ళాడు.

Advertisement

also read : ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్…అర్జున్ క‌పూర్ సీరియ‌స్..!

న్యూయ‌యర్ వేడుకల్లో భాగంగా వీరిద్దరూ ఓ హోటల్ రూమ్ లో ఉన్న ఫోటోలను విక్రమ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాకుండా బ‌నిత బాల్కనీలో నిలుచుని ఉన్న మరో ఫోటోను కూడా ధృవ్ షేర్ చేశాడు. దాంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై మరోసారి తమిళ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విక్రమ్ హీరోగా నటించిన ఆదిత్య వర్మ సినిమా తమిళ్ లో అనుకున్న‌మేర‌ విజయం సాధించలేకపోయింది. కానీ హీరోయిన్ తో డేటింగ్ వ‌ల్ల‌ మాత్రం ధృవ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.