Telugu News » ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్…అర్జున్ క‌పూర్ సీరియ‌స్..!

ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్…అర్జున్ క‌పూర్ సీరియ‌స్..!

by AJAY MADDIBOINA

ప్రేమ‌కు వ‌యసుతో సంబంధం లేదు. ఇది వ‌ర‌కూ త‌మ కంటే చిన్న‌వ‌య‌సు క‌లిగిన మ‌హిళ‌ల‌నే పెళ్లాడేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. త‌మ‌కంటే వ‌య‌సులో పెద్ద‌వారిని కూడా పురుషులు ప్రేమిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అడిగితే సచిన్ చేసుకోలేదా..? అభిషేక్ బ‌చ్చ‌న్ చేసుకోలేదా అంటూ ఎదురు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా అదే దారిలో ఉన్నాడు. అర్జున్ క‌పూర్ త‌న‌కంటే ప‌న్నెండేళ్లు పెద్ద‌దైన హీరోయిన్ మ‌లైకా అరోరాతో డేటింగ్ లో ఉన్నాడు. తాను చేసిన సినిమాల కంటే డేటింగ్ వ్య‌వ‌హారమే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

arjun kapoor malika arora

arjun kapoor malika arora

ఒక‌టి రేండేళ్లు తేడా ఉంటే ఏం ప‌ర్వాలేదు కానీ ఏకంగా ప‌న్నెండేళ్లు అనేస‌రికి బాలీవుడ్ జ‌నాలు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంతే కాకుండా మ‌లైకా అరోరా బాలీవుడ్ హీరో స‌ల్మాన్ సోద‌రుడి భార్య కాగా ప్ర‌స్తుతం వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి రిలేష‌న్ షిప్ పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. అయితే తాజాగా అర్జున్ క‌పూర్ ఓ టీవీ ఇంట‌ర్య్వూలో సీరియ‌స్ గా స‌మాధానం ఇచ్చాడు.

also read :  చిరు “మందాకినీ” సాంగ్ పై ట్రోల్స్…వార్నీ ఈ పాటను అక్కడ కాపీ కొట్టారా..?

ట్రోల్స్ పై మీరు ఎలా స్పందిస్తారు అని హీరోని అడ‌గ్గా…స‌మాధానం కావాల్సింది మీడియాకు కానీ ప్రేక్ష‌కుల‌కు కాదు. ట్రోలింగ్ లో తొంభైశాతం మందిని ప‌ట్టించుకోము..అదంతా ఫేక్ ఎందుకంటే అలా కామెంట్లు చేసేవాళ్లు నేను క‌నిపిస్తే సెల్ఫీ అడుగుతారు. కాబ‌ట్టి ఆ ట్రోల్స్ ను న‌మ్మ‌లేం. నా వ్య‌క్తి గ‌త జీవితంలో నేను ఏమైనా చేస్తాను. నేను చేసే ప‌నికి గుర్తింపు వ‌స్తే అది చాలు. ఎవ‌రి వ‌య‌స్సు ఎంత అనేదాని గురించి మీరు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి లైఫ్ వాళ్లు జీవించాలి. రిలేష‌న్ షిప్ కు వ‌య‌సుతో సంబంధం లేదు. వ‌య‌సు చూసి రిలేష‌న్ షిప్ లోకి వెళ్ల‌డం వెర్రితనం. అంటూ అర్జున్ క‌పూర్ ఫైర్ అయ్యారు.

You may also like